తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి
తిరుపతి
ప్రజలు కరోనాతో ఒక పక్క వర్షాలతో మరో పక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అభివృద్ధిలో ముందు ఉండాల్సిన రాష్ట్రం
ఆంద్రప్రదేశ్.సంచలన,వివాదస్పదమైన వ్యాఖ్యలతో ,అధికార ప్రతిపక్షాలు ముందుంటున్నాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు బుధవారం
అయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.తరువాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న కొన్ని సంఘటనలకు ప్రధానమైన వైసిపి,టీడీపీ పార్టీలు
బాధ్యత వహించాలి.....
ఏపీ సీఎం జగన్,40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ప్రజలకు కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది....
చంద్రబాబు కొంతమందితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు వేస్తున్నారు....
వ్యతిరేక ప్రకటనలకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఆయన ప్రతినిధులు
మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ, టీడీపీ ప్రధాన నాయకులు వారి స్వార్ధ రాజకీయాల కోసం మాత్రమే పని చేస్తున్నారు.కేంద్రం నుండి నిధులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి
కి ఏమాత్రం కృషి చెయ్యడం లేదు వైసిపి,టీడీపీ లు.దేశ ప్రజల ముందు ఆంద్రప్రదేశ్ పరువును జగన్ మోహన్ రెడ్డి,చంద్రబాబులు కలిసి గంగలో కలిపేశారని అన్నారు.
పార్లమెంట్ సభ్యుడు మరణించడంతో తిరుపతిలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికలపై బిజెపి,జనసేన చర్చించి త్వరలోనే ఒక
ప్రకటన విడుదలచేయనుందని వెల్లడించారు. పార్లమెంటరీ ఎలక్షన్ లో వైసీపీకి ఓటేసినా, ఉనికిని కోల్పోయి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్న చంద్రబాబు పార్టీ
టీడీపీకి ఓటేసినా చిత్తూరు జిల్లా ప్రజలు ఇబ్బంది పడక తప్పదని అయన అన్నారు. వైసిపి, టీడీపీ నాయకులు రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్ననాళ్ళు వివాదాలకు
కేంద్రీకృతంగా ఉంటుంది తప్ప అభివృద్ధికి నోచుకోదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొన్ని కీలక వ్యస్థల్లో ఆయన హస్తం ఉందని అప్పటి ప్రతి పక్ష పార్టీ
ఆరోపించింది....
పై విషయం పై ఇప్పటికి చంద్రబాబు స్పందించక పోవడం అంతర్యమేమిటని అయన ప్రశ్నించారు.
వైసిపి,టీడీపీ నాయకులు మధ్య నడుస్తున్నజగన్నాటకంలో సూత్రధారి ఎవరు పాత్రధారి ఎవరు అనేది ఇరువురు ప్రజలకు సమాధానం చెప్పాలని అయన అన్నారు.