20 నుంచి స్పెషల్ ట్రైన్స్
విజయవాడ,
దసరా పండగ రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా 392 స్పెషల్ రైళ్లు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 30 మధ్య ఈ రైళ్లు నడవబోతున్నాయి. ప్రధానమైన, ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్లలో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. నారాయణాద్రి, గౌతమి, శబరి, ఛార్మినార్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు నడవబోతున్నాయి. వీటిలో రోజు నడిచే రైళ్లతో పాటు వారానికి 2,3 రోజులు.. వారానికి ఓ సారి నడిచే రైళ్లున్నాయి.స్పెషల్ రైళ్లు మాత్రమే కాదు.. థర్డ్ ఏసీ బోగీలు అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 666 రైళ్లను (మెయిల్/ ఎక్స్‌ప్రెస్‌లు)ను ప్రత్యేకంగా నడుపుతోంది. వీటికి అదనంగా 50 రోజుల పాటు పండగ ప్రత్యేక రైళ్లను నడుపుతారు. నవంబరు 30 తర్వాత నిలిచిపోతాయి. ప్రత్యేక రైళ్ల టిక్కెట్ ధరలే వీటికి కొనసాగుతాయి. అంటే ఆయా తరగతులను బట్టి సాధారణ రైళ్లతో పోలిస్తే 10-30% మేర ఎక్కువగా టికెట్ ధర ఉంటుంది.తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే స్పెషల్ ట్రైయిన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిరోజు నడిచేవి.. తిరుమల ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం-కడప), నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్-తిరుపతి), గౌతమి (లింగంపల్లి-కాకినాడ), నర్సాపూర్ (సికింద్రాబాద్-నర్సాపూర్), ఛార్మినార్ (హైదరాబాద్-చెన్నై), శబరి (సికింద్రాబాద్-త్రివేండ్రం), బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (కాచిగూడ-మైసూర్), హుబ్లీ ఎక్స్‌ప్రెస్ (హుబ్లీ-సికింద్రాబాద్ )
వారానికి 5 రోజులు: విశాఖపట్నం-విజయవాడ డబుల్ డెక్కర్
వారానికి 3 రోజులు: రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్-రాజ్‌కోట్)
వారానికి 2 రోజులు: జైపూర్ ఎక్స్‌ప్రెస్ (హైదరాబాద్-జైపూర్) వయా నాందేడ్
వారానికి ఒక రోజు: గౌహతి ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్-గౌహతి).
వారానికి 2 రోజులు: తిరుపతి-అమరావతి (మహారాష్ట్ర),
వారానికి ఒక రోజు: భువనేశ్వర్-తిరుపతి (విజయవాడ మీదుగా)
వారానికి ఒక రోజు: అమరావతి ఎక్స్‌ప్రెస్ (విజయవాడ-హుబ్లీ).
వీటితోపాటు తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి