YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

హైదరాబాద్‌ లో వాయుగండం, రెండు రోజుల సెలవు

హైదరాబాద్‌ లో వాయుగండం, రెండు రోజుల సెలవు

హైదరాబాద్‌ లో వాయుగండం, రెండు రోజుల సెలవు
హైద్రాబాద్,
తెలంగాణ‌పై వాయుగుండం కొన‌సాగుతూనే ఉంది. హైదరాబాద్‌ను ఇప్పటికే వర్షం అతలాకుతలం చేసింది.నగరమంతా నీటిమయం అయ్యింది. దీంతో ఇప్పుడు మరో గండం భాగ్యనగరానికి పొంచి ఉంది. పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం బలహీన పడనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలుచోట్ల అతి భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించారు అధిారులు.ఈ క్ర‌మంలో రెండు, మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. భూమికిపైకి వ‌చ్చినా బ‌ల‌హీన‌ప‌డ‌కుండా వాయుగుండం స్థిరంగానే కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని గుల్బ‌ర్గాకు 80 కిలోమీట‌ర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృత‌మైంది. ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా 25 కి.మీ. వేగంతో వాయుగుండం క‌దులుతోంది. సాయంత్రానికి క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డి అల్ప‌పీడ‌న ప్రాంతంగా మారే సూచ‌న ఉంది. ప‌శ్చిమ వాయ‌వ్యంగా క‌దులుతూ అరేబియా స‌ముద్రంపైకి వెళ్తున్న‌ట్లు అంచనా వేశారు. ఎల్లుండి మ‌ళ్లీ అల్ప‌పీడ‌న ప్రాంతం వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంది. ఈశాన్య దిశ‌గా క‌దులుతూ మ‌హారాష్ర్ట - గుజ‌రాత్‌కు ద‌క్షిణంగా తీరం దాటే అవ‌కాశం ఉంది. వాయుగుండం ప్ర‌భావంతో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. తెలంగాణ‌లో అనేక చోట్ల 20 సెం.మీ. పైగా వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. వాయుగుండం ప్ర‌భావంతో రేప‌ట్నుంచి క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌, గోవాకు భారీ వ‌ర్ష సూచ‌న ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు‌. మరో వైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. నిన్నటినుంచి కరెంట్ లేక నానా అవస్థలు పడుతుననారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాతబస్తీలో భారీ వర్షాలకు ఇల్లు కూలి 9మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. పార్కులు మూసివేశారు. ఉద్యోగులకు రెండు రోజులు సెలవు ప్రకటించారు.

Related Posts