YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు వ్యూహం ఏమిటీ...

చంద్రబాబు వ్యూహం ఏమిటీ...

చంద్రబాబు వ్యూహం ఏమిటీ...
విజ‌య‌వాడ‌, 
చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మూడు సార్లూ పీఠానికి దగ్గర దారి ఎలా వేసుకోవాలో బాబే సొంత వ్యూహాలు రూపొందించుకున్నారు. బాబుకు నిజానికి ఎవరి సలహాలూ సూచనలు అసలు అవసరం లేదు. చంద్రబాబు సొంత బుర్రతోనే ఆలోచించగలరు. ఆయన చాణక్య రాజకీయాన్ని పక్కాగా అమలుచేయగలరు. అయితే బాబు వ్యూహాలు ఇప్పుడు కొంతవరకూ బెడిసికొడుతున్నాయి. ఆయన అనుకున్నది ఒకటైతే వేరేది జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు రాజకీయ జీవితంలో అతి పెద్ద వ్యూహాత్మకమైన తప్పిదంగా బీజేపీతో విడిపోవడాన్ని చెబుతారు. 2018 ఎన్నికల్లో బాబు మోడీ బ్యాచ్ కి తలాఖ్ అనేసి ఎంత పెద్ద ఓటమిని కొనితెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే.ఇక చంద్రబాబు దారుణంగా ఓడాక తన తప్పు తెలుసుకున్నారు. నాటి నుంచి మోడీ కనుసన్నల్లో పడేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికైనా మోడీ భాయ్ కరుణించకపోతాడా అని చంద్రబాబుకు ఎక్కడో ఆశ. ఏపీలోని రాజకీయాన్ని పూర్తిగా గుప్పిట పట్టేసిన బాబుకు తాను తప్ప బీజేపీకి వేరే దిక్కు లేదన్న గట్టి నమ్మకం ఉందిట‌. దాంతో మోడీకి జై అంటూ అవసరం ఉన్నా లేకపోయినా చేయి కలుపుతున్నారు. ఇది ఎంతదాకా వచ్చిందంటే ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా కూడా పెద్దాయనకూ తనకూ అతి పెద్ద బంధం ఉందని అనుకూల మీడియతో రాతలు రాయిపించుకునేదాకా అని చెప్పాలి.దీని మీద‌సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపోతున్నారు. చంద్రబాబు ఎందుకు మోడీని కీర్తిస్తున్నారో అర్ధంకావడంలేదని అంటున్నారు. మోడీ ఏం చేస్తాడని చంద్రబాబుకు భయమో చెప్పాలని కూడా నిగ్గదీస్తున్నారు. ఉంటే గింటే జగన్ కి మోడీ మీద భయం భక్తి ఉండాలని కూడా ఆయన సూత్రీకరిస్తున్నారు. జగన్ కి జైలు భయం ఉంది. ఒకసారి వెళ్ళి వచ్చాడు. ఆయన కేసులు తిరగతోడుతారేమోనని ఆయన మోడీకి సలాం చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు నారాయణ. మరి చంద్రబాబుకు ఎందుకు భయం, హాయిగా విపక్ష కూటమి వైపు వచ్చి ఎదిరించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.అంతటితో ఆయన వూరుకోవడంలేదు. మోడీ ప్రజావ్యతిరేక విధానాలను చంద్రబాబు గట్టిగా ఎదిరిస్తే ఆయన మీద ఏవైనా కేసులు పెడతాడన్న భయం ఉందా అని కూడా అడుగుతున్నారు. ఒకవేళ కేసులు పెట్టి జైలు కి పంపితే మంచిదే కదా అని కొత్త విషయాలు చెబుతున్నారు. జైలుకు వెళ్ళిన తరువాత జగన్ సీఎం అయ్యాడు, చెడిపోలేదు బాబూ అని కూడా గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు కూడా జైలు కి వెళ్తే జనమే ఆయన్ని నెత్తిన పెట్టుకుంటారని, మళ్ళీ సీఎం పీఠం తెచ్చి అప్పగిస్తారంటూ గెలుపు దారులు కూడా చూపిస్తున్నారు. అందువల్ల చంద్రబాబు ఈ భయాలు అన్నీ వదిలేసి తమతో చేతులు కలపాలని మోడీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కూడా కోరుతున్నారు. కేంద్రంలోని మోడీ నిరంకుశ విధానాలను ఎండగట్టాలని కూడా సూచిస్తున్నారు. నారాయణ బాగానే చెప్పారనుకున్నా చంద్రబాబుకు జైలుకెళ్ళినా ప్రజలలో సానుభూతి రాకపోతే అక్కడే బంధీ అయిపోతే టీడీపీ గతేం కానూ అంటున్నారు తమ్ముళ్ళు. పద్మవ్యూహంలోకి రమ్మంటూ అభిమన్యున్ని పిలిచినట్లుగా నారాయణ చంద్రబాబును ఇరికిస్తున్నారా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారుట.

Related Posts