YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎవరికి వారే ధీమా

ఎవరికి వారే ధీమా

ఎవరికి వారే ధీమా
మెద‌క్,
ఇప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా ఉన్న ఎన్నిక అంటే దుబ్బాక‌నే. రెండు తెలుగు రాష్ట్రాలు దుబ్బాక‌లో ఎవ‌రు గెలుస్తారు అని చూస్తున్నారు. ఏపీలో కూడా ఈ ఎల‌క్ష‌న్ పై ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయింది. ఇక తెలంగాణ‌లో అయితే కారాలు మిరియాలు దంచుతున్నారు. అధికార పార్టీ ఎలా ఉన్నా.. అపొనెంట్ పార్టీల‌కి మాత్రం చావో రేవో అన్న‌ట్లుంది య‌వ్వారం. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని ప‌ట్టుమీదున్నారు. ఓడిపోయినా.. డిపాజిట్లు రాక పోయినా.. మొహం చూపించుకోలేం నాయ‌నా అంటూ త‌ల ప‌ట్టుకుంటున్నారు.ఇప్ప‌టికే నిజామాబాద్ ఎల‌క్ష‌న్ తో కాంగ్రెస్, బీజేపీ లీడ‌ర్లు బిక్క మొహం వేశారు. డిపాజిట్లు కూడా రాక‌పోవ‌డంతో కిందిస్థాయి లీడ‌ర్ల ముందు త‌లొంచుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. టీఆర్ఎస్ కు వంద‌ల్లో ఓట్లు వ‌స్తే.. బీజేపీ కాంగ్రెస్ కి మాత్రం ప‌దుల్లో వ‌చ్చాయి. మ‌రీ ఇంత దారుణంగా ఓడిపోయారా అంటూ రాష్ట్రం మొత్తం న‌వ్వారు. టీఆర్ఎస్ లీడ‌ర్లేమో కాల‌ర్ ఎగరేస్తున్నారు. వెంట‌నే ఈ ఎల‌క్ష‌న్ కూడా ఉండ‌డంతో క‌త్తిమీద సాములా ఉంది. వీళ్లేమో గెలిచామ‌న్న ఆనందంతో దీన్ని కూడా అదే మెజారిటీతో గెలిచి తీరాల‌ని చూస్తున్నారు. ఆ పార్టీలేమో.. ఈ అవ‌మానాన్ని ఇక్క‌డి ఓట్ల‌తో, విక్ట‌రీతో, మెజార్టీతో చూపించాల‌ని ప‌ట్టుద‌ల మీదున్నారు. పైకి ఎలా ఉన్నా.. లోప‌ల మాత్రం.. ఓట్లు మ‌రీ దారుణంగా వ‌స్తే.. అధిష్టానాల ముందు మొహం చూపించ‌లేం అనే ఫీలింగ్ తో ఉన్నార‌ట‌. కార్య‌క‌‌ర్త‌లు..కిందిస్థాయి లీడ‌ర్లు కూడా క‌సిమీదే తిరుగుతున్నారు.దుబ్బాక విజయం కాంగ్రెస్ కు చావో రేవో లాంటిది అన్నారు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్. గెలిచి జాతీయ పార్టీ ప‌వ‌ర్ ఏంటో చూపిస్తాం అంటున్నారు. ఇక ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. పాత ప‌ద్ద‌తుల్లో కాకుండా కొత్త కొత్త వ్యూహాల‌తో ముందుకెళ్తున్నామంటున్నారు. ‌దుబ్బాకలో ప్ర‌తి గ్రామానికి ఒక పార్టీ ఇంచార్జ్ ను పెట్టి.. గెలుపు కోసం క‌ష్ట‌ప‌డుతున్నామ‌న్నారు

Related Posts