ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ ఉప ఎన్నికలకు సిద్ధమంటోంది. టీడీపీ ఆలోచనలో పడింది. వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదం పొందితే ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. దీంతో ఉప ఎన్నికలు వస్తే ఏం చేయాలన్న దానిపై టీడీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయాలా? దూరంగా ఉండాలా? అన్నదానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంకు చెందిన ఒక నేత మాత్రం పోటీకి దిగి తీరుదామన్నారు. ఎన్నిక ఏకగ్రీవం చేస్తే వెనకడుగు వేసినట్లుందని ఆయన అభిప్రాయపడ్డారు.మరికొందరు మాత్రం ప్రత్యేక హోదా సెంటిమెంట్ తో రాజీనామాలు చేశారు కాబట్టి దూరంగా ఉండటమే మంచిదని తేల్చి చెప్పారు. అలా చెప్పింది కూడా శ్రీకాకుశానికి చెందిన మంత్రే కావడం విశేషం. ఇలా ఉప ఎన్నికల టెన్షన్ టీడీపీని పట్టి పీడిస్తుంది. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించి ప్రజాతీర్పుకోసం వెళతామని చెబుతున్నారు. అవసరమైతే మరోసారి స్పీకర్ ను కలిసి రాజీనామాలను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయాలను వివరించారు. దీంతో ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతాయన్న భావన కలుగుతోంది. రెండోసారి స్పీకర్ ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించమంటే ఆమె విధిగా ఆమోదించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు సీనియర్ నేతలతో ఉప ఎన్నికలపై చర్చించారు. స్పీకర్ రాజీనామాలను ఆమోదిస్తే మొత్తం ఐదు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక వేళ ఉప ఎన్నిక జరిగితే 35 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. సెంటిమెంట్ ను ఆధారంగా చూపి పోటీకి వెనక్కు తగ్గితే 35 నియోజకవర్గాల్లో తన ప్రభావం ఏంటో చూపే అవకాశం లేకుండా పోతుంది. అలాగని పోటీకి దిగి సెంటిమెంట్ కారణంగా ఓటమి పాలయితే సాధారణ ఎన్నికల ముందు పార్టీకి ఘోరమైన అవమానమే ఎదురవుతుంది.అందుకే దీనిపై ఆచితూచి అడుగువేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్క కడప తప్ప మిగిలిన నాలుగు స్థానాల్లో బలమైన అభ్యర్థులు టీడీపీకి ఉన్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందులో పవర్ లో ఉండటం కూడా కలిసొచ్చే అంశమే. అయితే ఇది నంద్యాల ఉప ఎన్నికల్లో లా వ్యూహం రచించలేమని టీడీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. దాదాపు 35 శాసనసభ నియోజకవర్గాల్లో నంద్యాల ప్లాన్ ను అమలుచేయడం కష్టమేనంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొం