భార్య తల నరికిన భర్త
సంగారెడ్డి
నారాయణఖేడ్ మండలం ఆనంతసాగర్ లో దారుణం జరిగింది. అనుషమ్మ (42) అనే వివాహితను భర్త సాయిలు దారుణంగా హతమార్చాడు. తలను మొండంనుంచి వేరు చేసాడు. మొండాన్ని అనంతసాగర్ లో, తలను నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా మందిర్ వద్ద ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లారు. మృతురాలికి అక్రమసంబంధం వుందని సాయిలు అనుమానించాడు. చివరకు హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.