YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అదుపు తప్పిన లారీ

అదుపు తప్పిన లారీ

అదుపు తప్పిన లారీ
విశాఖపట్నం 
విశాఖపట్నం ఎన్ఏడీ ప్లైవర్  వద్ద గురువారం తెల్లవారు జామున ఒక లారీ అదుపు తప్పి అటుగా వెళ్తున్న ఆటో ఫై బోల్తా పడింది. ఘటనకు వివరాలు ఇలా వున్ఆనయి. అచ్చుతాపురం నుండి ఐరన్ లోడుతో వస్తున్న లారీ  ఎన్ .ఏడీ మీదుగా బిర్లా కూడలి వద్ద గురువారం తెల్లవారు జామున సుమారు రెండు గంటల ప్రాంతంలో వాహనానికి డీజిల్ నింపుకొని తిరిగి బిర్లాకుడలి నుండి ఎన్ .ఏడీ మీదుగా పోర్టు కు వెళ్తున్న క్రమంలో ఫ్లైవర్ కిందకి వచ్చే సరికి ఒక్క సారిగా రోడ్డు డివైడర్ పైకి దూసుకుపోయింది.  అటుగా వెళ్తున్న ఆటో పై బోల్తా పడింది . ప్రమాదంలో  ఆటో పూర్తిగా నుజ్జు నుజవ్వగా ఆటోలె  ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంచరపాలెం పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.  నిద్ర మత్తే  ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు .

Related Posts