YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

బీజేపీ యేతర రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల భేటీ

 బీజేపీ యేతర రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల భేటీ

కేంద్ర సర్కారుపై పోరాటానికి టీడీపీ వ్యూహా రచనలు చేస్తోంది.  సమావేశానికి బీజేపీ యేతర పాలిత ఆర్ధిక మంత్రల  చేతులు కలుపబోతున్నాయి.కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్న నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు తిరువనంతపురంలో భేటీ అయిన సందర్భంలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు గైర్హాజరయ్యాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాలు పలు అరశాలపై చర్చిరచాయి. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇటీవల తిరువనంతపురంలో భేటీ కాగా, రెండో భేటీని విజయవాడ వేదికగా నిర్వహించనున్నారు. అయితే ఈసారి దేశంలోని అన్ని బిజెపియేతర రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పోరాటాన్ని ఉధృతం చేయాలని సంకల్పించారు. ఈ బాధ్యతను ఎపి రాష్ట్ర ఆర్థిక శాఖకు అప్పగించారు. దీంతో ఇతర రాష్ట్రాలను ఆహ్వానించే పనిలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు బిజీ అయ్యారు. ఈసారి చర్చల్లో ఆర్థిక నిపుణులను కూడా భాగస్వాములను చేస్తూ వారినీ ఆహ్వానిస్తున్నారు. మరోసారి మరిరత లోతుగా చర్చిరచేరదుకు భేటీ కావాలని అక్కడే నిర్ణయిరచగా, ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేరదుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిరది. తొలుత విశాఖపట్నంలో ఈ భేటీని నిర్వహించాలనుకున్నా, చివరిగా విజయవాడకు వేదికను మార్పు చేశారు. ఈ భేటీకి కొత్తగా ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలను కూడా ఆహ్వానించాలని నిర్ణయిరచారు. దేశంలో బిజెపితో పొత్తు లేని రాష్ట్రాలను కూడా గుర్తిరచి ఈ సమావేశానికి ఆహ్వానిరచేరదుకు అన్ని చర్యలు తీసుకురటున్నారు. తిరువనంతపురం వేదికగా కొరతమంది ఆర్థిక నిపుణులు అత్యంత లోతుగా సమస్యలపై చర్చించారు. సమావేశానికి ఆర్ధిక మంత్రులతో పాటు ఇప్పటికే ప్రముఖ ఆర్థిక నిపుణుడు గోవిరదరావుతోపాటు మరి కొరదరి పేర్లను గుర్తిరచారు. అయితే వారిలో కొరదరు ప్రస్తుతం అరదుబాటులో లేకపోవడం వల్ల సమావేశాన్ని నెలాఖరులోగానీ, మే నెల తొలి వారంలోగానీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీకి దాదాపు బీజేపీ యేతన ప్రభుత్వాలు ఓకే చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్‌, నిపుణల సూచనలతో అజెండాను కూడా సిద్ధం చేస్తున్నామని వారు వివరిరచారు.

Related Posts