ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం లో పావులూరుగ్రామం లోఇంకొల్లు పొలిమేరలో శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంది .గ్రామ పొలిమేర లో ఉండటం వాన ఆ పేరు సార్ధక మైంది .
ఆలయానికి గర్భాలయం లేకపోవటం ,ఒక విశేషం .స్వామి మూల విరాట్ పై మంచి భవనం కట్ట్టాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా విఫలమవటం మరో ప్రత్యేకత .అందుకని పై కప్పు లేకుండానే మండపం నిర్మించాల్సి వచ్చింది .సింధూర వర్ణం తో కాకుండా స్వామి ఇక్కడ వివిధ వర్ణాలతో వింతగా శోభించటం చిత్రాతి చిత్రం .
ఆలయ గోడలపై రామాయణ చిత్రాలు చూడ ముచ్చటగా ఉండటం మరో వింత .మహాద్వారం పై భరత ,లక్ష్మణ శత్రుఘ్న సమేత శ్రీ సీతా రాముల విగ్రహాలు ఉన్నాయి వీటికి కుడివైపున శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ,ఎడమ వైపు అభయాంజ నేయ స్వామి ,ఉన్నారు .ప్రధాన ఆలయం లో శ్రీ వీరాంజనేయ స్వామి కొలువై ఉంటాడు
.వైఖానస ఆగమ విధానం లో పూజాదికాలు జరుగుతాయి .సువర్చ లాంజ నేయ ఉత్సవ విగ్రహాలకు నిత్యం అభిషేక పూజలు నిర్వహిస్తారు .సంవత్సరం లో మూడు సార్లు సువర్చ లాంజనేయ స్వామి వారల కళ్యాణం చేయటం మరొక ప్రత్యేకత.హనుమజ్జయంతి శ్రీరామ నవమి వేడుకలు ఘనం గా జరుపుతారు .
ఈ ఆలయం వెనక శ్రీ భవనం అంజిరెడ్డి గారి సాయం తో నిర్మించిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలతోకూడిన దేవాలయం ఉంది .ప్రాంగణం లో గంగా,అన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వనాధ సన్నిధి ఉంటుంది .ఈ శివలింగాన్ని కాశీ నుండి తెప్పించి ప్రతిస్టించటం విశేషాలలో విశేషం .
నిత్యం ఏకాదశ రుద్రం తో అభిషేకాలు జరుగుతాయి విశ్వేశ్వరాలయానికి ఎడమ వైపు అన్నపూర్ణాలయం ఉంది .అమ్మవారు సర్వాలంకార శోభితం గా దర్శన మిస్తుంది .కుడివైపు గంగా దేవి మందిరం ఉన్నది .
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో