YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కలుషిత నీటితో రోగాల బారిన చేపలు

కలుషిత నీటితో రోగాల బారిన చేపలు

కలుషిత నీటితో రోగాల బారిన చేపలు
గుంటూరు, 
చేపల విక్రయాలతో పాటు శుభ్రపర్చే పనిని సాగునీటి కాల్వపైనే చేపట్టడంతో ఈ నీటిని తాగునీటిగా ఉపయోగించే పలు గ్రామాలకు ముప్పు పొంచి ఉంది.  చేపల విక్రయాదారులకు ఉన్న సొసైటీకి సంబంధించి ఇదే ప్రాంతంలో పెదపులివర్రు వైపు వెళ్ళే రహదారి, కాలువకు మధ్య కొంత పోరంబోకు భూమిని సొసైటీ కింద కేటాయించారు. ఆ స్థలంలో చేపల విక్రయాలు చేపడితే తాగు నీటికి వినియోగించుకునే బ్యాంకు కెనాల్‌ నీరు కలుషితం కాకుండా ఉంటుంది. చేపల విక్రయాలకు కేటాయించిన స్థలంలో మత్య్సకార సభ్యులకు షెడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం నుండి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. కేటాయించిన స్థలం పల్లంగా ఉండటంతో కొందరు సభ్యులు మెరకలు తోలించుకున్నారు. అయితే ఆ మేరకు గ్రామ పంచాయతీ అధికారులు మత్య్సకారులకు అవగాహన కల్పించి వంతెన ప్రాంతంలో చేపల విక్రయాలు చేపట్టకుండా దాని వలన జరిగే అనర్థాలను వారికి వివరించి వారికి కేటాయించిన స్థలంలో షెడ్ల నిర్మాణాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.వెల్లటూరులో కృష్ణా, పశ్చిమ బ్యాంక్‌ కెనాల్‌పై ఉన్న నూతన వంతెనపై చేపల విక్రయాలు చేపడుతున్నారు. విక్రయించిన చేపలను వంతెన సమీపంలోని మరో పాత వంతెనపై కొందరు వాటిని శుభ్రపర్చి వినియోగదారులకు అందిస్తుంటారు. విక్రయం, శుభ్రపర్చగా చేపల నుండి వచ్చే వ్యర్థాలు కాలువలోనే వదిలివేయడంతో భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని దిగువ ప్రాంతాల్లో నీటిని ఉపయోగించే ప్రజలు కలుషిత నీటిని తాగునీటిగా వినియోగించాల్సిన పరిస్ధితులున్నాయి. ముఖ్యంగా రేపల్లె మండలంలోని గంగడిపాలెం, రాజుకాల్వ, లంకివానెదిబ్బ, కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న రెండు రేవుల మధ్యలో గల ఏటి మొగ వరకు ఈ నీరే తాగునీటికి వినియోగించుకోవాల్సి ఉంటుంది. వేలాది మంది ఉపయోగించుకునే నీరు కలుషితమవుతుందని, దీంతో ఆరోగ్యాలు దెబ్బతింటాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్లటూరు వంతెన పై విక్రయించి శుభ్రపర్చే చేపలతో కొంత మందికి ఉపాధి లభించినా ఎక్కువ శాతం ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో చేపల విక్రయాలు చేపట్టరాదని సంబంధిత అధికారులు అనేకమార్లు ఆదేశించినా ప్రయోజనం లేదు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి వంతెన పై విక్రయించే చేపల వ్యర్థాలు ఆ ప్రాంతంలో వేయకుండా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి కేటాయించిన స్థలంలో షెడ్డును నిర్మించి వారికి ఉపాధి కల్పించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Related Posts