YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కన్నడ కాంగ్రెస్ కు స్వతంత్రుల బెడద

కన్నడ కాంగ్రెస్ కు స్వతంత్రుల బెడద

కర్ణాటక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితా ఇలా విడుదల అయ్యిందో లేదో.. వెంటనే భారీస్థాయిలో రెబెల్స్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. చాలామంది సీనియర్ నాయకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తామని బెదిరించగా, కొందరు ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీదే తిరుగుబాటు చేశారు. అభ్యర్థుల జాబితా పూర్తిగా బయటపడక ముందే తిరుగుబాట్లు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి వ్యతిరేకంగా పలువురు తిరుగుబాటు నేతలు రోడ్లమీదకు వచ్చారు. ప్రధానంగా హంగల్, మాయకొండ, జగలూర్, తిప్తూర్, కునిగల్, కోలార్, కొల్లేగల్, బేలూర్, బాదామి, కిట్టూర్, రాజాజీ నగర్.. ఇలా పలు నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు కనిపించాయి. సుమారు 20 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు మంజులా నాయుడు రాజీజీనగర్ నియోజకవర్గం సీటు ఆశించి భంగపడ్డారు. దీంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆమె సిద్ధమయ్యారు. తాను రెండు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీకి విధేయతతో సేవ చేశానని, ఇప్పుడు శాసనసభ ఎన్నికలలో రాజాజీనగర్ నియోజకవర్గం అభర్థిగా అవకాశం ఇస్తామని చెప్పి చివరికి జాబితాలో తన పేరును తొలగించి మేయర్ పద్మావతికి టికెట్ ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి కంచుకోటగా పేరుపొందిన రాజాజీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు తాను ఎంతో కృషి చేశానన్నారు. అలాగే ప్రస్తుతం హంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్సైజ్ శాఖ మాజీమంత్రి మనోహర్ తహసీల్దార్ మద్దతుదారులు ఆయనకు టికెట్ రాకపోవడంతో నిరసన తెలిపారు. జగలూర్ ఎమ్మెల్యే హెచ్‌పీ రాజేశ్ తన పేరు జాబితాలో లేకపోవడంతో సీఎంను కలిసేందుకు ఆదివారం రాత్రే బెంగళూరు వెళ్లారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఈసారి కిట్టూర్ టికెట్ రాకపోవడంతో డీబీ ఇనామ్‌దార్ మద్దతుదారులు పార్టీపై మండిపడ్డారు. ఆయన బంధువు బాబాసాహెబ్ పాటిల్‌కు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. 2013లో బెంగళూరులోని సీవీ రామన్ నగర్ నుంచి పోటీచేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు పి.రమేశ్.. ఈసారి తనకు టికెట రాకపోవడంతో అక్కడినుంచే జేడీ(ఎస్) అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇపుడున్నది ఇందిరాగాంధీ కాంగ్రెస్ కాదని, ఇది సిద్దరామయ్య తుగ్లక్ కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డా రు. ఆ స్థానంలో రవేుశ్‌కు బదులు ఈసారి మేయర్ ఆర్. సంపత్‌రాజ్‌కు టికెట్ ఇచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ వర్గా ల మధ్య పోరు కారణంగా ఈసారి చాలామందికి టికె ట్లు దక్కకపోవడం.. దానివల్లే తిరుగుబాట్లు తలెత్తడం సంభవించినట్లు తెలుస్తోంది. బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చుకుంటూ సీఎం సిద్దరామయ్య కూడా నియంతలా వ్యవహరిస్తున్నారని పోటీకి అవకాశం రానివాళ్లు మండిపడ్డారు. టికెట్లు రానివాళ్లలో చాలామంది స్వతంత్రులుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరికొందరు జేడీ(ఎస్) వైపు వెళ్తున్నారు.

Related Posts