కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది...అన్ని పార్టీల నేతలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీ అవుతున్నారు.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నారు... ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బీజేపీ యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి క్రికెట్ దిగ్గజాలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.. అయితే వారు అందుకు సముఖంగా లేనట్లు సమాచారంతెలుగు ఓటర్ల ఆగ్రహం, పార్టీ నేతల అత్యాచారాలు వంటి వాటితో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదురీదాల్సి వస్తోంది.. అయితే ఎలాగైనా కర్ణాటకలో పాగా వేయాలని చూస్తున్న కమలనాథులు యువ ఓటర్లను ఆకర్షించడానికి కొత్త స్కెచ్ గీస్తున్నారు.. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లను తమ పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కుంబ్లే, ద్రవిడ్‌లను బరిలోకి దించి ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది... అయితే వారిద్దరూ రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం... ఈ విషయమై స్థానిక బీజేపీ నేతలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లతో చర్చించగా వారు విముఖత చూపించారు. అయితే వారిని ఎలాగైనా ఒప్పించాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో వారిలో ఒకరిని రాష్ట్ర అసెంబ్లీ బరిలోకి దింపి.. మరొకరిని జాతీయ రాజకీయాల్లోకి పంపుతామని కూడా ఆఫర్ ఇస్తున్నారు కమలనాథులు,,, అయితే వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం... దీనిపై బీజేపీ నేతలు మాట్లాడుతూ..కుంబ్లే, ద్రవిడ్‌తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు.. కనీసం వారిలో ఒకరినైనా లోక్‌సభ లేదా రాజ్యసభ బరిలో దింపుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఈ విషయంపై కుంబ్లే, ద్రవిడ్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు... కర్ణాటకలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి... ఇప్పటికే అక్కడ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కుంబ్లే ఆ తర్వాత భారత జట్టుకు కోచ్‌గా సేవలు అందించారు... ప్రస్తుతం ఐపీఎల్ 11వ సీజన్‌కు కామెంటేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరో పక్క ద్రవిడ్ ఇండియా-ఎ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉన్నారు