YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ధరణి సేవల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలి

ధరణి సేవల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలి

హైదరాబాద్  అక్టోబర్ 17

ధరణి సేవల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలి   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  విజయదశమి నాడు ధరణి పోర్టల్   ప్రారంభించనున్న  సీఎం కేసీఆర్  దసరా నుంచి తిరిగి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్ సేవలు
ధరణి పోర్టల్ ద్వారా సేవలు అందించేందుకు  అవసరమైన ఏర్పాట్లు చేసుకుని  సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ద్వారా సేవలు అందించే అంశం పై శనివారం సి ఎస్ జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, తహసిల్దార్ ల పాత్ర, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలు గురించి సిఎస్ అధికారులకు వివరించారు. కొత్త రెవెన్యూ చట్టం లో భాగంగా వ్యవసాయ భూముల మాదిరిగానే గ్రామంలోని ఇండ్లు ఇతర అన్ని రకాల నిర్మాణాలకు సైతం భద్రత కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ధరణి యాప్ లో ఆస్తుల వివరాలు నమోదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. గ్రామంలో ఉన్న పాఠశాలలు ,దేవాలయాల, ఇతర భూముల వివరాలను సైతం తప్పనిసరిగా ధరణి యాప్ లో పొందుపరచాలని, ఆస్తులకు సంబంధించి యాజమాన్య వివరాలు ఫోటోను అప్ లోడ్ చేయాలని సూచించారు. ప్రజలకు భూ సంబంధిత అంశాలలో పారదర్శకత, బాధ్యతాయుతమైన భద్రత కలిగిన సేవలు అందించే దిశగా ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో స్వయంగా పర్యవేక్షిస్తూ రూపొందించారని సిఎస్ తెలిపారు.   జిల్లా కలెక్టర్లు తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది గతంలో నిర్వహించిన భూ శుద్దీకరణ కార్యక్రమం వివరాల ప్రకారం గత వానాకాలం పంట సమయంలో 57.94 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.7283 కోట్ల నగదును ఎలాంటి వివాదాలకు  తావులేకుండా 48 గంటల్లో జమ చేశామని తెలిపారు.   ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నూతన చట్టాలను ప్రవేశపెట్టిందని సి ఎస్ అధికారులకు వివరించారు.  గతంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్  కార్యాలయంలో మ్యుటేషన్ తహసిల్దార్ కార్యాలయంలో జరిగేదని, దీనివల్ల రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని గమనించిన ముఖ్యమంత్రి నూతన చట్టాలను తీసుకు వచ్చారని తెలిపారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ప్రక్రియ ఇక పై తహసిల్దార్ కార్యాలయం లోనే జరుగుతాయని, మండల తహసిల్దార్ లు జాయింట్ సబ్ రిజిస్టర్ లు గా వ్యవహరిస్తారని తెలిపారు.    రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయెతర భూముల వివరాలను సేకరిస్తున్నామని, దీనిపై సంబంధిత అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని సి ఎస్ అభినందించారు.  ధరణి పోర్టల్ గురించి ప్రతి వార్డు లో ప్రతి మున్సిపాలిటీలో  పోస్టర్లు అంటించాలని, ఆస్తుల వివరాల అతికించాలిని సూచించారు.    నూతన చట్టాల ప్రకారం నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సేవలు ప్రజలకు అందించాలని, అధికారులకు ఎటువంటి వ్యక్తిగత నిర్ణీత అధికారాలు ఉండవని నిబంధనల మేరకు మాత్రమే పని చేయాలని స్పష్టం చేశారు.  అనంతరం అధికారులకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరణి పోర్టల్ ద్వారా చేసే ప్రక్రియను   సిఎస్ వివరించారు. వ్యవసాయ భూమి విక్రయించే సమయంలో అమ్మవారు కొనుగోలు దారులు తమ లావాదేవీలు చేసుకొని, రిజిస్ట్రేషన్ కొరకు ధరణి పోర్టల్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని, స్లాట్ బుక్ చేసుకోవడానికి అనుసరించే పద్ధతి ఆంగ్లం, తెలుగు భాషల్లో వెబ్ సైట్ నందు పేర్కొనడం జరిగిందని తెలిపారు. దసరా నుంచి భూ రికార్డులన్నీ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ విధానంలో  జరుగునున్న ఎవరైనా తప్పుడు వివరాలు అందిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు  ధరణి  పోర్టల్ సైతం వినియోగదారుడికి సౌలభ్యంగా ఉంటుందని , ఎవరైనా సులభంగా ధరణి పోర్టల్ వినియోగించవచ్చని తెలిపారు. వ్యవసాయ భూమి విక్రయ సమయంలో స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో విక్రయదారుడీ పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్ నమోదు చేసి భూముల వివరాలను పరిశీలించి, విక్రయించే భూమి దాని సర్వే నెంబర్ ను తొలగించి కొనుగోలుదారుడు పట్టా పాస్ పుస్తకం లో నమోదు చేయాలని, కొనుగోలు దారుడికి పట్టా పుస్తకం లేని పక్షంలో నూతన ఈ పట్టా పుస్తకం అందించాలని, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూముల మ్యుటేషన్ ప్రక్రియ సైతం చేయాలని సీఎస్ ఆదేశించారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా అంతర్జాలం సహకారంతో భూముల వివరాలు తెలుసుకోవచ్చని, భూ యాజమాన్య హక్కులు మార్చే సమయంలో (కొనుగోలు విక్రయాల) తప్పనిసరిగా ఆధార్  కార్డు తో అనుసంధానం చెందిన భూ యజమాని వేలిముద్రలు ద్వారా బయోమెట్రిక్ అనుసంధానం చేస్తే మాత్రమే వివరాలు మార్చవచ్చని , తహసిల్దార్ , ధరణి ఆపరేటర్ భూ యజమాని వేలిముద్రలు ద్వారా బయోమెట్రిక్ అనుసంధానం చేస్తేనే భూమి వివరాలు మార్చే అవకాశం ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు.  భూ రికార్డులను యాజమాన్య హక్కులను అధికారులు తమంతట తాము మార్చే అవకాశం ఉండదని తెలిపారు. విజయదశమి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ప్రారంభిస్తున్నారని, అప్పటివరకు తహసిల్దార్ కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకొని, ధరణి ద్వారా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు తెలంగాణలో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించిన తరహాలో ధరణి పోర్టల్ లో ప్రతి ఒక్క విషయం రికార్డ్ చేపడుతుందని, ఫోటోలు సంతకాలు వేలిముద్రలతో సహా రికార్డు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ధరణి పోర్టల్ నిర్వహణ కోసం అనే తాసిల్దార్ కార్యాలయంలో అవసరమైన కంప్యూటర్లు సిసిటివి కెమెరాలు స్కానర్లు ప్రింటర్ ప్రింటర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. సోమవారం లోపు ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో తప్పనిసరిగా 10 కేసులైన అప్ లోడ్ చేయాలని తెలిపారు.
   అనంతరం  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు  పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసిన ప్రభుత్వ భూములు, అభ్యంతరాలు ఉన్న  భూములు, కోర్టు పరిధిలో ఉన్న భూముల విక్రయాల సమయంలో అనుసరించాల్సిన విధానం, భూ సక్సెషన్ పై  స్పష్టతనందించాలని కోరారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ పట్టాదారు పాసుపుస్తకం పరిధిలో ఉన్న భూముల క్రయ విక్రయాలు మాత్రమే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని, ప్రభుత్వ భూములకు పొరపాటున పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినట్టు గుర్తిస్తే వెంటనే సదరు భూమిని స్వాధీనం చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆ భూముల లావాదేవీలు జరగకుండా 22ఎ కింద నమోదు చేయాలని, కోర్టు లావాదేవీలు పరిధిలో ఉన్న భూముల వివరాలు కోర్టు తీర్పుల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.  వ్యక్తిగత కుటుంబ అంశాలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని, భూ యజమాని పట్టాదార్ పాస్ పుస్తకం ఫామిలీ ట్రీ ఉంటుందని, సదరు కుటుంబసభ్యులందరూ కలిసి నిర్ణయించి అందించిన సమాచారం మేరకు మాత్రమే మనం భూ బదలాయింపు చేయాలని, కుటుంబాల్లో వివాదాలు ఉన్న పక్షంలో కోర్టులను ఆశ్రయించవచ్చని సి ఎస్ తెలిపారు.  ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆటో లాక్ విధానం అనుసరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
 

Related Posts