YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్ ఘన విజయం

న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్ ఘన విజయం

వెల్లింగ్టన్‌ అక్టోబర్ 17 
న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్ రెండోసారి విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిర్వహించడంలో ఆమె చూపిన చొరవకు ఈ ఘన విజయం తార్కాణంగా  నిలిచింది. శనివారం జరిగిన పోలింగ్‌లో 1.9 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం కొనసాగిన కౌంటింగ్‌లో 50 శాతం బంపర్‌ మెజార్టీ సాధించి జెసిండా  చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ఎన్నికల విధానాన్ని మొదలుపెట్టిన 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం  విశేషం.జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని సెంటర్-లెఫ్ట్ లేబర్ పార్టీ 50 శాతం ఓట్లతో 65 స్థానాలను గెలుచుకుంది. నేషనల్ పార్టీ కేవలం 27 శాతం ఓట్లతో 35 స్థానాల్లో విజయం  సాధించారు. 2002 నుండి నేషనల్‌ పార్టీకి ఇదే చెత్త ఫలితం. న్యూజిలాండ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పోటీ ఇద్దరు మహిళల మధ్యే జరిగింది. 61 ఏళ్ల జుడిత్ కాలిన్స్ ప్రధాని జెసిండా  ఆర్డెర్న్ (40) ను సవాలు చేశారు. లేబర్ పార్టీకి చెందిన జెసిందా 2017 లో ప్రధాని అయ్యారు. జెసిండా నేతృత్వంలోని న్యూజిలాండ్.. కొవిడ్-19 ను నియంత్రించడంలో గణనీయమైన  విజయాన్ని సాధించింది. గురువారం నాటికి ఇక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.ఆక్లాండ్‌లో శనివారం రాత్రి మద్దతుదారులతో జెసిండా ఆర్డర్న్‌ మాట్లాడారు. “రాబోయే  మూడేండ్లలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కొవిడ్ సంక్షోభం నుంచి ప్రజలు క్షేమంగా బయటపడ్డారు. దేశ పునరుద్ధరణను మరింత వేగవంతం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు  దేశ ప్రజలకు కృతజ్ఞతలు” అని జెసిండా చెప్పారు.

Related Posts