YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మే10న రైతులకు చెక్కులు

మే10న రైతులకు చెక్కులు

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు బంధు పథకం కింద అన్నదాతలకు చెక్కులు పంపిణీ చేసే ముహూర్తాన్ని ఖరారు చేసింది. మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై చర్చించారు. మే 10 నుంచి రైతులకు చెక్కుల్ని పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఏడాదికి ఎకరాకు రూ.8వేల చొప్పున... మొదటి విడతగా రూ.4వేలను అందజేయనున్నారు. అదే రోజు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను కూడా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందిస్తున్నామని... ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారుల్ని కోరారు సీఎం కేసీఆర్. భూ రికార్డుల ప్రక్షాళన వల్ల పాసు పుస్తకాలను రైతులకు అందించేందుకు ఇబ్బందులు తొలగిపోయాయని... ధరణి వెబ్‌సైట్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ చెక్కుల పంపిణీకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 2వేల 762 బృందాలను నియమిస్తున్నారు. ఒక్కో టీమ్ రోజుకు 300 లెక్కన చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేస్తుంది. 

Related Posts