YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మ‌ళ్లీ సీతారామ‌ల‌క్ష్మికే అవ‌కాశం

మ‌ళ్లీ సీతారామ‌ల‌క్ష్మికే అవ‌కాశం

ఏలూరు, అక్టోబ‌రు 19, 
రాజ‌కీయాల్లో నాయ‌కుల అభిప్రాయాలు.. కోరిక‌లు.. ఆశ‌లు.. ఒక విధంగా ఉంటే.. పార్టీల అధిష్టానం నిర్ణయాలు.. ఆదేశాలు.. మ‌రో విధంగా ఉంటాయి. ఇప్పుడు టీడీపీలో పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుల ఎంపిక‌లోనూ కొన్ని కొన్నిచోట్ల ఇలాంటి ప‌రిణామాలే చోటు చేసుకున్నాయి. తాజాగా 13 మంది కీల‌క నేత‌ల‌కు చంద్రబాబు పార్లమెంట‌రీ జిల్లా ప‌గ్గాలు అప్పగించారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. ఇప్పుడున్న ప‌రిస్థితి నుంచి ఉన్నత ప‌రిస్థితికి తీసుకురావ‌డం, నియోజ‌క‌వ‌ర్గాల‌ను బ‌లోపేతం చేయ‌డం.. పార్టీని ప‌రుగులు పెట్టించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ క‌మిటీలు ఏర్పాటు చేశారు.వీటిలో కొంద‌రు నేత‌లు కోరుకున్న విధంగా నియామ‌కాలు జ‌ర‌గ్గా.. మ‌రికొన్ని పార్లమెంట‌రీ జిల్లాల్లో మాత్రం నాయ‌కులు కోరుకోక‌పోయినా.. వ‌ద్దన్నా కూడా చంద్రబాబు.. స్వయంగా ఆయా నాయ‌కుల స‌త్తా గుర్తించి.. నియామ‌కాలు జ‌రిపారు. ఇలా చేసిన నియామ‌క‌మే.. న‌ర‌సాపురం పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షురాలిగా తోట సీతారామ‌ల‌క్ష్మి నియామ‌కం. సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న టీడీపీ నేత‌ల్లో సీతారామ‌ల‌క్ష్మి ఒక‌రు. ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కు పార్టీ అధ్యక్షురాలిగా 11 ఏళ్ల పాటు ఆమె ప‌నిచేశారు. వివాద ర‌హితురాలిగా.. పార్టీ కోసం అంకిత భావంతో ముందుకున‌డిచిన నాయ‌కురాలిగా కూడా గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే ఆమెను చంద్రబాబు గ‌తంలో రాజ్యస‌భకు పంపారు. ఈఏడాది ఏప్రిల్‌లో ఈ ప‌ద‌వీ కాలం ముగిసింది. ఈ క్రమంలో తాజాగా నియ‌మించిన పార్లమెంట‌రీ జిల్లాల క‌మిటీల్లో న‌ర‌సాపురం పార్లమెంటు క‌మిటీ అద్యక్ష ప‌గ్గాల‌ను ఆమెకు అప్పగించారు. అయితే.. ఈ ప‌ద‌వి త‌న‌కు వ‌ద్దని ఆమె పేర్కొన్నారు. రాజ్యస‌భ స‌భ్యురాలిగా, ఉమ్మడి జిల్లాకు ఏకంగా 11 ఏళ్లు పార్టీ అధ్యక్షురాలిగా చేసిన తాను ఇలాంటి ప‌ద‌విని చేప‌ట్టలేనని చెప్పిన‌ట్టు తెలిసింది. ఇంకేదైనా ఇవ్వాల‌ని కోరారు. అయితే, ఇప్పటికిప్పుడు ఇచ్చేందుకు ప‌ద‌వులు లేక‌పోవ‌డం, మ‌రో ఐదేళ్లవ‌ర‌కు వెయిట్ చేయాల్సి రావ‌డంతో చంద్రబాబు దీనికే ఆమెను ఎంపిక చేశారు.ఇదిలావుంటే, మ‌రోప‌క్క, సీతారామ‌ల‌క్ష్మి.. త‌న కుమారుడు తోట జ‌గదీష్‌కు భీమ‌వ‌రం ఇంచార్జ్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే, అక్కడే మాజీ మంత్రి విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా వియ్యంకుడు అంజిబాబు ఉన్నారు. దీంతో దీనిపై త‌ర్వాత నిర్ణయం తీసుకుంటాన‌ని, ప్రస్తుతం న‌ర‌సాపురం పార్లమెంట‌రీ జిల్లా బాధ్యత‌ల‌ను చూడాల‌ని చంద్రబాబు సీతారామ‌ల‌క్ష్మిని ఒప్పించిన‌ట్టు తెలిసింది. మొత్తానికి నిబ‌ద్ధ‌త గ‌ల నాయ‌కురాలికి మంచి ప‌ద‌వే ద‌క్కింద‌ని జిల్లా నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts