YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అప్పేనా... సాయం ఉండ‌దా

అప్పేనా... సాయం ఉండ‌దా

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 19, 
ఏపీ అన్ని రకాలుగా ఇబ్బందులో ఉంది. విభజన తరువాత అప్పు చేసి పప్పు కూడు తప్ప ఏపీ సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడే సీన్ లేదు. ఇక అయిదేళ్ళ పాటు చంద్రబాబు రాజ్యం చేశారు. ఆయన ప్రాధాన్యతలు వేరు. దాంతో ఏపీకి ఆదాయం లేదు, అప్పులు మాత్రం అయిదేళ్ళలో రెండున్నర లక్షలకు చేరాయి. ఇక జగన్ వచ్చారు. ఆయన మద్యం అమ్మకాలు వద్దు అన్నారు. బెల్ట్ షాపులు తీయించారు. దాని వల్ల ఖజానాకు వెంటనే చిల్లు పడింది. ఇక మరో వైపు చూస్తే సంక్షేమ పధకాలు చేతికి ఎముక లేనట్లుగా పంపిణీ చేస్తున్నారు. అంటే రెండు వైపులా చెంపకాయలు అన్నట్లుగా ఏపీలో ఆర్ధిక పరిస్థితి దిగజారింది. మరో వైపు చూస్తే వందేళ్లకు ఒకసారి వచ్చే కరోనా లాంటి మహమ్మారి జగన్ ఏలుబడిలోనే వచ్చిపడింది. దాంతో ఏపీలో కాళ్ళూ చేతులూ ఆడని పరిస్థితి ఉంది.ఆఖరుకు ఎలా తయారైందంటే పరిస్థితి. అప్పు చేసుకుంటాం మహాప్రభో. మా తిప్పలేవో పడతాము అని కేంద్రాన్ని దేబిరించుకున్నా అనేక షరతులు పెట్టి మరీ నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చుకోవచ్చు అని ఢిల్లీ పెద్దలు కరుణించారు. మరి ఈ అప్పు తీర్చాల్సిన బాధ్యత రాష్ట్రానిదే. అంటే డైరెక్టుగా ప్రజలది. మరి కేంద్రం ఆపదలో ఉన్న రాష్ట్రాలను ఆదుకోవడం మరచిపోయింది. అడిగేందుకు ఏపీ పాలకులకు ఏదో అడ్డువస్తోంది. మొత్తానికి అప్పు చేసుకోండి అని అనుమతి ఇస్తే అదే అతి పెద్ద పండుగగా మారింది మరిఇపుడు తెలుగు రాష్ట్రాల గుండెల్లో గునపంలా తుఫాన్ వచ్చిపడింది. బంగారు లాంటి భాగ్యనగరమే చిద్రమయ్యాక‌ ఏపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అత మంచిదేమో. సముద్ర తీరాన్ని ఆనుకుని ఏపీ ఉంది. అక్టోబర్, నవంబర్ నెలలు తుఫాన్ గండాలుగా చెబుతారు. అలాంటిది ఈసారి కనీసం 20 లక్షల ఎకరాల పంటను తుఫాన్ వచ్చి పట్టుకుపోయింది. రోడ్లు అన్నీ సర్వనాశనం అయ్యాయి. మరో వైపు చూస్తే ఇల్లూ వాకిళ్ళూ కూలి ఆస్తినష్టం కూడా దారుణంగా ఉంది. తెలంగాణాకు తుఫాన్ నష్టం అయిదు వేల కోటు అని అక్కడి ప్రభుత్వం తేల్చింది. ఇవ్వాలంటూ మోడీకి లేఖ రాసింది. మరి ఏపీలో అంతకు మించి నష్టం జరిగితే కేంద్రాన్ని అడగాలిగా. జగన్ ఈ విషయంలో మెతకగా ఉన్నారని అపుడే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయతాజాగా జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వెయ్యి కోట్ల తక్షణ సాయం అవసరమని కోరారు. ఎటూ కేంద్రం సాయం చేయదు అని సగటు పౌరునికి కూడా తెలుసు. కానీ అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు. అలా ఏపీ ప్రభుత్వం కూడా తుఫాన్ నష్టం అంచనాలు వేసి కేంద్రం ముందు పెడితే కనీసం పదవవంతు అయినా విదిలించే చాన్స్ ఉంటుందేమోనని చిన్న ఆశ. ఈ విషయంలొ జగన్ ఏం గట్టిగా కేంద్రాన్ని అడగాలని విపక్షాలు కూడా కోరుతున్నాయి. మరి మోడీ అప్పు చేసుకోమన్నారని సంబరపడుతున్న ఏపీ సర్కార్ ఇపుడు ఉదారంగా సాయం చేయమంటే ఏమనుకుంటారో అని మొహమాటపడితే నష్టపోయేది అక్షరాలా ఏపీ జనాలే.

Related Posts