కర్నాటక బీజేపీ లో మళ్లీ మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి శకం మొదలైంది. జైలు నుంచి బయటకొచ్చాక ఆయన పూర్తి స్థాయిలో పావులు కదుపుతున్నారు. బళ్లారినే కాదు.. చాలా చోట్ల తన అనుచరులను రంగంలోకి దింపుతున్నారు. ఇందుకయ్యే ఖర్చును ఆయనే భరిస్తున్నారు. ఎంతగా అంటే గాలి జనార్దన్ రెడ్డిని అనుచరులు సిఎంగా పోలుస్తున్నారు. తన కుటుంబ సభ్యులు, అనుయాయులు కొందరికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్లు ఇప్పించుకున్నారు గాలి. గాలి జనార్ధన రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి పోటీ చేయబోతున్నారు. జనార్దనరెడ్డికి సన్నిహితుడైన బి.శ్రీరాములు సమీప బంధువు పకీరప్ప కు టిక్కెట్ వచ్చింది. కాగా అవినీతి కేసును ఎదుర్కుంటున్న మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడుకు టిక్కెట్ రావడం వెనుక గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. తన అనుచరులతో పోటీ చేయించే గాలి జనార్దన్ రెడ్డి మరోవైపు ఏపీ రాజకీయాల్లోను అడుగేస్తున్నట్లు తెలుస్తోంది.. 82 మంది అభ్యర్థులతో విడుదల చేసిన రెండో జాబితాలో గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డికి బళ్లారి సిటీ టికెట్ కేటాయించారు. ముందు నుంచి బళ్లారి సిటీ సీటు విషయంలో బీజేపీ ఏం చేస్తుందా ? అన్న ఆసక్తి ఒక్క కర్ణాటకలోనే కాకుండా ఇటు సౌత్ ఇండియా పాలిటిక్స్‌లోనూ వ్యక్తమైంది. అయితే ముందుగా ఇక్కడ నుంచి గాలి సోదరులకు కాకుండా ఓ డాక్టర్‌కు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని బీజేపీ భావించింది. వెంటనే గాలి తన అనుచరులతో మీటింగ్ పెట్టి ఇక్కడ నుంచి తన సోదరుడిని ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి సత్తా చాటాలని చూశాడు. గాలి ఓ విధంగా బీజేపీ అధిష్టానానికి వార్నింగ్‌లా ఇవ్వడంతో షాక్ అయిన బీజేపీ వాళ్లు చివరకు బళ్లారి సిటీ సీటును గాలి ఫ్యామిలీకే కేటాయించక తప్పలేదు. ఫైనల్‌గా గాలి విషయంలో బీజేపీ అధిష్టానం తలొగ్గింది…. గాలి పై చేయి సాధించారు. బళ్లారి టికెట్‌ను గాలి కుటుంబానికి కేటాయించడంతో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బళ్లారి ప్రాంతంలో గాలి కుటుంబానికి గట్టి పట్టుంది. సోమశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయించడం బీజేపీకి చాలా ప్లస్ కానుందని అంచనా. గాలి వర్గానికి దాదాపు తొమ్మిది సీట్లు వరకూ అధిష్టానం కేటాయించింది.రాబోయే కాలంలో వైసీపీ అధినేత జగన్ తో ఆయన సంబంధాలను మరింతగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిలో లేవు. దైవభక్తుడిగా మారాడు గాలి. జైలుకు వెళ్లి వచ్చాక జ్ఞానోదయం అయిందనుకుంటా. అందుకే సిఎం చంద్రబాబునాయుడు అంతు తేలుస్తానని చెప్పిన వ్యక్తి.. అసుల ఏబీఎన్ రాధాకృష్ణ సంగతి చూస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అయినా సరే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో గాలి జనార్దన్ రెడ్డి తన కేసుల నుంచి బయట పడేందుకు చూస్తున్నారు. ఇప్పటికే చాలా కేసుల నుంచి బయట పడ్డారు. మరిన్ని కేసుల నుంచి బీజేపీ అతనికి ఉపశమనం కలిగించింది. కర్నాటక ఎన్నికల్లో అతని సేవలను బాగా వినియోగించుకుంటోంది బీజేపీ. ఫలితంగా గాలి ఇప్పుడు పూర్తి స్థాయి క్రియాశీలకంగా మారాడు.