YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త కోర్సులు

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త కోర్సులు

వ‌రంగ‌ల్, అక్టోబ‌రు 19, 
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతిచ్చిన 19,240 కొత్త సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వంద వరకు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈ కోర్సులను నిర్వహించేందుకు ఓకే చెప్పింది. ఇందు లో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, పాత సీట్లను రద్దు చేసుకొని, కొత్త కోర్సుల్లో సీట్లకు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న 13,820 సీట్లతో పాటు ఆర్థిక భారం కలిగిన మరో 5,350 అదనపు సీట్లకు ఆమోదం తెలిపింది. వాటికి అనుబంధ గుర్తింపు ఇచ్చేందు కు జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలకు అనుమతిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌టీయూ పరిధిలోని 90 వరకు కాలేజీల్లో 18,210 సీట్లతో బీటెక్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌–మెషీన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ (నెట్‌ వర్క్స్‌)వంటి కొత్త కోర్సులను నిర్వహించేందుకు ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ జీవో జారీ చేశారు.ఈ కోర్సుల కోసం ఏటా అదనంగా రూ.33.85 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని వెల్లడించా రు. నిబంధనల ప్రకారం ఈ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని జేఎన్‌టీయూను ఆదేశించినట్లు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం నేతలు గౌతంరావు, కృష్ణారావు వెల్లడించారు. ఏఐసీటీఈ ఇచ్చిన కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వీటితోపాటు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వెయ్యి కి పైగా సీట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల జారీ కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం వరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చినందున విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు జాగ్రత్తగా ఇచ్చుకోవాలని సూచించారు.రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త సీట్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అనుబంధ గుర్తింపు జారీపై యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ ప్రారంభించనున్నాయి.అనుబంధ గుర్తింపు వస్తే అదేరోజు రాత్రి నుంచి విద్యా ర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపడతామని ప్రవేశాల క్యాంపు అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు జారీలో ఆలస్యమైతే 19 నుంచి వెబ్‌ ఆప్షన్లు ప్రారంభించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇక ఏఐసీటీఈ ఈ సారి రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,10,873 సీట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్నింటికి అనుబంధ గుర్తింపు జారీ చేస్తాయన్నది  తేలనుంది.  

Related Posts