హైద్రాబాద్, అక్టోబరు 19,
ఓ పక్క జనాలు చస్తున్నరు. అయినా ఈ వ్యభిచారం ఆగదు. ఎందుకు ఆగుతుంది చెప్పండి. దేని దారి దానిదే. ఈ టైంలోనే పోలీసులు, ఆఫీసర్లు బిజీగా ఉంటారని.. వీళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. ఓ పక్క బతుకు పోరాటం చేసే వాళ్లు చేస్తుంటే.. ఇంకో పక్క తిన్నదరక్క ఎర్రేశాలు వేసేవాళ్లు వేషాలేస్తుంటారు. ఆకలి కేకలు వేస్తూ.. బతుకు జీవుడా అని బంగ్లాదేశ్ నుంచి.. బతకడానికి వస్తున్న అమ్మాయిల్నే టార్గెట్ చేస్తున్నారట.. ప్రాస్టిట్యూషన్ బ్రోకర్ గాళ్లు. బోర్డర్ దాటించడం ఈజీ కదా. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అని చెప్పి తీసుకురావడం.. ఇక్కడికొచ్చా వాళ్లకి ఏ దారీ లేకుండా చేయడం. ఇక అప్పుడేం చేస్తారు చెప్పండి. వెనక్కి వెళ్లలేరు. ఇక్కడ ఉండలేరు. వాళ్లని సైలెంట్ గా సైడ్ ట్రాక్ లోకి తీసుకొచ్చి.. బడా బాబులు.. బడా బాబుల పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్నారట. వీటిపై ఎన్ ఐ ఏ గట్టిగానే ఫోకస్ చేసింది. ఇక్కడ దొరుకుతున్న గ్యాంగుల్లో బంగ్లాదేశ్ అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారట. కేవలం సైడ్ ట్రాక్ పట్టించడమే కాదు. అందంగా ఉండి.. ఒప్పుకోని అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. ఏదో ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచారంలోకి దింపుతున్నారట. అయినా తగ్గకుండా లెక్క చేయని అమ్మాయిల్ని బలవంతంగా హోటల్ రూమ్స్ లో బంధించి.. ఇష్టం లేకపోయినా ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నారట. పాపం అమ్మాయిలు బతకడానికి వచ్చిన వాళ్లు.. ఏ దిక్కూలేని వాళ్లు.. అందుకే వాళ్ల ఆటలు సాగుతున్నాయట. కొన్నాళ్ల తర్వాత వాళ్లే అలవాటై పోతారు అని ఏదో ఒక రకంగా ప్రాస్టిట్యూషన్ లోకి దింపేసి.. తర్వాత బుజ్జగించి బాగోతం బయటికి రాకుండా దాస్తున్నారట. వాళ్లకోసం లోకల్ ఐడీ కార్డులు నకిలీవి క్రియేట్ చేసి.. చానాళ్లుగా ఇదే పని చేస్తున్నారట. ఇలాంటి గ్యాంగులు సిటీలో చాలా చోట్ల ఉన్నాయట. మెయిన్ గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లనే టార్గెట్ చేసి.. దందా చేస్తున్నారట.