YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో శ్రీ‌ మలయప్ప అభ‌యం

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో శ్రీ‌ మలయప్ప అభ‌యం

తిరుమల,  అక్టోబరు 19
శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు  క‌ల్ప‌వృక్ష వాహనంపై రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో అభ‌య‌మిచ్చారు.  క‌ల్ప‌వృక్ష వాహ‌నం - ఐహిక ఫ‌ల ప్రాప్తి క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, డా. నిశ్చిత‌, వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి,  చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి,  డిపి.అనంత‌,  కుమార‌గురు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
 

Related Posts