జగ్గంపేట అక్టోబరు 19
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట యోజకవర్గంలో జగ్గంపేట కిర్లంపూడి మండలా లలోని రామవరం గోనాడ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం పర్యటించారు. ముందుగా జగ్గంపేట లో గల కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఇంటి వద్దకు వచ్చారు. తర్వాత రామవరం గ్రామంలో బిల్డింగ్ కూలిపోయి వ్యాపార సామాగ్రి వరదల్లో కొట్టుకుపోయి లక్షల్లో నష్టం వాటిల్లిన కర్రి సూరిబాబు ( జయ బాబు) కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం వీరిని వెంటనే ఆదుకునే తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తర్వాత రామవరం, గోనేడ మధ్యలో ఉన్న నీట మునిగిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 25 వేల రూపాయలు ఎకరాకు అందించాలని ఈ పంట కోసం ఇప్పుడు వరకు రైతులు చేసిన బకాయిలను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్. మాజీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), పెందుర్తి వెంకటేష్. పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు. కాకినాడ మేయర్ కాకినాడ కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్. తుని నియోజకవర్గ ఇన్చార్జ్ యనమల కృష్ణుడు. పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్. జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.