మోడీకి, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. సంఘ్ పరివార్ లోని కొన్ని శక్తులు తమ లక్ష్యం నెరవేర్చలేదన్న కోపంతో ఉన్నాయా..? అంటే ఇటీవల ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు నిజమేనని అంటున్నాయి. సంఘ్ పరివార్ లోని వీహెచ్ పీ, ఆర్‌ఎస్ విపరీత వ్యాఖ్యలు అనుమానాన్ని నిజం అనిపిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న వరుసఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోడీని ఈ ఇద్దరు నేతల మాటలు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టడం ఖాయమని పలువురు అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లో బీజేపీకి అధిక మెజారిటీ రావడంతో ఇక తమ చిరకాల కోరికల్ని మోడీ నెరవేరుస్తాడని ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలు అనుకన్నాయి. కానీ, నాలుగేళ్లయినా మోడీ అడుగు ముందుకు పడకపోవడంతో ఆయనపై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి.అయోధ్యలోని రామ్ మందిర్‌ను ధ్వంసం చేసింది భారత దేశంలో ఉన్న ముస్లింలు కాదు.. రామమందిర్‌ను నిర్మించడం భారత జాతి కర్తవ్యం.. అయోధ్యలో ధ్వంసమైన రామమందిర్‌ను తిరిగి అదే స్థానంలో పునర్మించే బాధ్యత మనపై ఉంది. దాని కోసం ఎంత పోరాటానికైనా సిద్ధం.. రామ మందిరాన్ని పునర్మించకపోతే, మన సంస్కృతి సంప్రదాయాల మూలాలు తెగిపోయే ప్రమాదం ఉంది.. ఈ రోజు మనం స్వతంత్రులం, ధ్వంసమైన రామ మందిరాన్ని పునర్మించుకునే హక్కు మనకు ఉంది.. ఇవీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ చేసిన వ్యాఖ్యలు. గతంలో కూడా ‘కాంగ్రెస్–ముక్త్ భారత్’ వంటి నినాదాలు కేవలం రాజకీయపరమైనవనీ, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు.అయితే ఇక్కడ విషయమేమిటంటే.. ఆర్‌ఎస్‌ఎస్‌ను సిద్ధాంత కర్తగా చెప్పుకుంటున్న బీజేపీ, మోదీ ప్రభుత్వం చేస్తున్న ‘కాంగ్రెస్ విముక్త భారత్’ నినాదంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇదిలా వుండగా హిందువుల సంక్షేమానికి మంగళవారం నుంచి తాను ఆమరణ దీక్ష చేయబోతున్నట్లు విశ్వహిందూపరిషత్‌ను వీడిన అగ్రనేత ప్రవీణ్‌తొగాడియా చెప్పారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి తాను ప్రతిపాదించిన అభ్యర్థి ఓడిపోవడంతో ఆయన ఆ సంస్థను వీడుతున్నట్లు ప్రకటించారు.అహ్మదాబాద్‌లో ఆదివారం తన మద్దతుదారులతో ఆయన సమాలోచనలు జరిపిన అనంతరం ఆయన మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వంపై భ్రమలు తొలగిపోయాయన్నారు. 2014 ఎన్నికల్లో మోడీకి వీహెచ్‌పీ పూర్తి మద్దతు ప్రకటించింది.. అయినా ఆయన గో రక్షకులను గూండాలుగా చిత్రీకరించారు.. అంటూ ఆయన మండిపడ్డారు. గోవధపై నిషేధం, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తదితర డిమాండ్ల సాధనకు ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.