YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం

బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం

ఎమ్మిగనూరు అక్టోబరు 19        
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బీసీ కులాలను బ్యాక్వర్డ్ క్లాస్ కాకుండా బ్యాక్ బోన్ కాస్ట్ గా బీసీలను చూసు కుంటానని పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా 136 కులాలను 56 బీసీ కార్పొరేషన్ లకు చైర్మన్ గౌరవ చైర్మన్ డైరెక్టర్లు నియమించి ప్రభుత్వంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించినందుకు వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.  బీసీ సోదరులు ప్రభుత్వానికి, సీఎం  జగన్ మోహన్ రెడ్డికి  కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ లో మహత్మ జ్యోతిరావు పూలే  చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. అక్కడ నుండి వైయస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ గా వెళ్లుతు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో బీసీల పండుగకు ముఖ్యమంత్రి అంకురార్పణ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే బీసీ సంక్షేమం కోసం  ప్రభుత్వం మ్యానిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా కేవలం 16నెలల్లోనే పలు పధకాల ద్వారా 2,71,37,253 మంది లబ్దిదారులకు దాదాపు 33,500 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో 56 కార్పొరేషన్ల ఏర్పాటును ఒక పర్వదినంలా జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్ని, కరికల కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదమ్మ  మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య గారు, కుమార్ గౌడ్ కె. శివన్న, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్ గారు టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె.రాజశేఖర్  సునీల్ కుమార్, దేవా రాజ్, పట్టణ వైఎస్సార్సీపీ మహిళ అధ్యక్షురాలు ఆన్నపూర్ణమ్మ, కో-ఆపరేటివ్ స్టోర్ అధ్యక్షుడు షబ్బీర్ ఆహ్మద్, షాబ్బద్దీన్, డైరెక్టర్ సయ్యద్ చాంద్, వడ్డె రంగన్న, వాహిద్, పట్టణ యువజన ప్రెసిడెంట్ నజీర్ ఆహ్మద్, మురారి రాజశేఖర్, మహబూబ్ బేగ్, శివ ప్రసాద్,చంద్ర మోహన్ రెడ్డి, నాగేషప్ప, శ్రీనివాస్ రెడ్డి, గట్టు ఖాజా, మెకానిక్ బాషా,రజాక్, ప్రతాప్ రెడ్డి, ఈరన్న వెంకటపురం బజారి,యిసాక్,శ్రీరాములు, ఆమాన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts