YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నఢీ అంటే..ఢీ శ్రీకాకుళం, 

అచ్చెన్నఢీ అంటే..ఢీ శ్రీకాకుళం, 

అచ్చెన్నఢీ అంటే..ఢీ
శ్రీకాకుళం, 
అచ్చెన్నాయుడు ఇపుడు ఏం చేస్తున్నారు. ఇది తమ్ముళ్లతో పాటు రాజకీయాల గురించి ఆలోచించేవారందరికీ వచ్చే పెద్ద డౌట్. అచ్చెన్నాయుడు గత నాలుగైదు నెలలుగా మౌనంగా ఉంటున్నారు. అందులో మూడు నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారనుకున్నా బెయిల్ మీద వచ్చిన తరువాత అయినా పెదవి విప్పాలి కదా. కానీ ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు. అంటే దాని వెనక ఏదో వ్యూహం ఉందని అంటున్నారు. ఈలోగా ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. జగన్ సర్కార్ మీద చాలా సార్లు విరుచుకుపడే చాన్స్ వచ్చినా కూడా అచ్చెన్న లాంటి దూకుడు స్వభావం ఉన్న వారు మౌనమే నా భాష అన్నట్లుగా ఉండడం అంటే విశేషమే కదా.కొన్నాళ్ళు తెర వెనక ఉండి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. జనాల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇదే అచ్చెన్నాయుడు స్ట్రాటజీలా ఉంది. పైగా అచ్చెన్న తనను అరెస్ట్ చేసిన తరువాత నుంచి కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీడియాను పూర్తిగా దూరం పెట్టారు. సొంత వూరు నిమ్మాడలోనే టైమ్ పాస్ చేస్తున్నారు. అలాంటి అచ్చెన్న ప్రెస్ మీట్ అంటే ఒక్కసారిగా అది హైలెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాదు టాప్ రేంజిలో టీయార్పీ రేటింగ్ కూడా వస్తుంది. అయితే ఊరకే బెయిల్ మీద వచ్చిన అచ్చెన్నాయుడులా కాకుండా కొత్త అచ్చెన్నను చూడాలంటే కొంత కాలం ఆగాలిట.అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఖాయమైంద్. ఆ విషయాన్ని విజయదశమి రోజున చంద్రబాబు ప్రకటిస్తారు. ఆ తరువాత సరైన సమయం చూసుకుని అచ్చెన్న ఆర్భాటంగా చంద్రబాబు, లోకేష్ ల సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారట. ఆ మీదట ఆయన నోరు విప్పుతారు. మరి ఆయన పెదవి విప్పితే డైనమేట్లే పేలుతాయి అని అనుచరులు అపుడే అంటున్నారు. అచ్చెన్నాయుడు మౌనాన్ని తక్కువగా చేసి చూడకండి సరైన సమయంలో సింహంలా ఆయన వీర విహారం చేస్తారు అని అంటున్నారు. మరి ఇది అచ్చెన్న సొంత ప్లానా లేక చంద్రబాబు డైరెక్షనా అన్నది తెలియడంలేదు కానీ అచ్చెన్నను బాగా హైలెట్ చేసి, హైప్ పెంచి మరీ జనంలోకి వదలాలని డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది.ఇకమీదట ఏపీలో వైసీపీ సర్కార్ మీద మాటకు మాట, కౌంటర్ కి కౌంటర్ అన్నట్లుగా అచ్చెన్నాయుడు దూకుడు సాగుతుంది అంటున్నారు. ఇన్నాళ్ళూ అసెంబ్లీలోనే అచ్చెన్న పెద్ద నోరుని చూసిన వారు ఇపుడు బయట కూడా చూస్తారని అనుచరులు చెబుతున్నారు. అచ్చెన్న చెడుగుడు ఆడిస్తారని టీడీపీలోని కొంతమంది నాయకులు కూడా గట్టిగానే నమ్ముతున్నారట . సరైన సమయానికి అచ్చెన్నాయుడు నోటి దగ్గరకు మైకు వచ్చిందని, దాంతో ఆయన ఊపేస్తారని కూడా అంటున్నారు. మరి అచ్చెన్న గర్జనలకు వైసీపీ కంపిస్తుందా. లేక ధీటుగా ఎదుర్కొంటుందా అన్నది రాబోయే రోజులలో తేలుతుంది.

Related Posts