సౌత్ ఇండియాలో టాప్ హీరోల్లో ఒకరు అయిన ప్రిన్స్ మహేష్‌బాబు సినిమా తమిళనాడులో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. తమిళనాట ఈ వివాదం ఇంకా కొలిక్కి రాకపోవడంతో అక్కడ బంద్ కంటిన్యూ అవుతోంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఈ విషయంలో ఎందాకైనా వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. దీంతో ఈ బంద్ ఎప్పుడు ముగుస్తుందో ఖచ్చితంగా తెలియడం లేదు. దీంతో ఈ నెల 20 నాటికి సమస్య కొలిక్కి రాకపోతే 20న రిలీజ్ అయ్యే భరత్ తమిళనాట రిలీజ్ అవుతుందా ? లేదా ? అన్నది సందిగ్ధంలో పడింది.వస్తుందంటే సౌత్‌లో ఓ పండగ వాతావరణం నెలకొంటుంది. మహేష్ తాజా సినిమా భరత్ అనే నేను సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి దిగుతోంది. ఇప్పటికే అన్ని చోట్లా భరత్ మేనియా స్టార్ట్ అయ్యింది. సినిమా ఎప్పుడు ఫస్ట్ షో పడుతుందా ? చూసేద్దాం అన్న ఆతృత ఎక్కువైపోయింది. ఇదిలా ఉంటే మహేష్‌బాబుకు శ్రీమంతుడు సినిమా నుంచి ఇతర భాషల్లో కూడా ఫాలోయింగ్ ఎక్కువైంది.శ్రీమంతుడు సినిమా తెలుగుతో పాటు తమిళ్‌లో సెల్వనందన్ పేరుతో రిలీజ్ అయ్యింది. అక్కడ అంచనాలు అందుకోలేకపోయినా ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. ఇక మహేష్ బ్రహ్మోత్సవం కూడా అక్కడ రిలీజ్ అయ్యింది. మహేష్ చివరి సినిమా స్పైడర్ సినిమా కూడా ఏకకాలంగా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వస్తోన్న భరత్ అనే నేను కూడా తమిళనాడులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా అక్కడ రిలీజ్ అవుతుందా ? లేదా ? అన్నది డౌట్‌గానే మారింది.ప్రస్తుతం తమిళనాడులో నెల రోజులుగా థియేటర్ల బంద్ జరుగుతోంది. అక్కడ నెల రోజులకు పైగా డిజిటల్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా తమిళ నిర్మాతల మండలి చేస్తున్న నిరసనకు తెలుగు నిర్మాతలు కూడ మద్దతు పలుకుతోన్న సంగతి తెలిసిందే. తెలుగులో చాలా తక్కువ రోజులకే నిర్మాతలకు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య ఒప్పందం కుదరడంతో ఇక్కడ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.