YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసంతృప్తిలో పంచుమర్తి…… గుంటూరు 

అసంతృప్తిలో పంచుమర్తి…… గుంటూరు 

అసంతృప్తిలో పంచుమర్తి……
గుంటూరు 
టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న మ‌హిళా నాయ‌కురాళ్లలో పంచుమ‌ర్తి అనురాధ ఒకరు. దాదాపు రెండున్నర ద‌శాబ్దాలుగా ఆమె పార్టీలోనే ఉన్నారు. విజ‌య‌వాడ మేయ‌ర్‌గా 1995లో ప‌నిచేశారు. ఆ స‌మయంలో పార్టీలో మంచిగుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ప‌ద్మశాలి సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమె.. బీసీ కోటాలో త‌న‌కు ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని గత చంద్రబాబు పాల‌న‌లో ఆశ‌లు పెట్టుకున్నారు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారు. పైగా జ‌గ‌న్ స‌ర్కారుపై అవ‌కాశం వ‌చ్చిన ప్రతిసారీ రెచ్చిపోయారు. ఫైర్ బ్రాండ్‌కు కొంచెం త‌క్కువే అయినా మంచి గుర్తింపు పొందారు. మీడియా చ‌ర్చల్లో పంచుమ‌ర్తి అనురాధ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు.గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి టికెట్‌ను ఆశించిన‌ట్టు వార్తలు వచ్చాయి. అయితే, అది కాస్తా చంద్రబాబు త‌న త‌న‌యుడు లోకేష్‌కు ఇచ్చుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయినా కూడా పంచుమ‌ర్తి అనురాధ ఏనాడూ పార్టీలైన్‌ను వీడ‌లేదు. చంద్రబాబు ఏపిలుపు ఇచ్చినా ముందున్నారు. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ కూడా వినిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్నాళ్ల కింద‌ట తెలుగు మ‌హిళ అధ్యక్ష ప‌దవికి ఎంపిక జ‌రిగిన‌ప్పుడు కూడా త‌న పేరు వ‌స్తుంద‌ని ఆశించారు. అయితే.. దీనిని ఎస్సీ కోటాలో చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌కు కేటాయించారు.స‌రే.. ఈసారైనా త‌న‌కు గుర్తింపు ల‌భించ‌క‌పోతుందా.. అనుకున్న పంచుమ‌ర్తి అనురాధ ఇటీవ‌ల పార్లమెంట‌రీ జిల్లాల మ‌హిళా క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తుండ‌డంతో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ వీటిలోనూ ఆమెకుచోటు ద‌క్కలేదు. గుంటూరు, విజ‌య‌వాడ‌ల్లో ఎక్కడా త‌న‌కు చోటు ద‌క్కక‌పోవ‌డంతో నిత్యం మీడియాలో ఉండే పంచుమ‌ర్తి అనురాధ ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జ‌రిగింది? ఎందుకు ఆమెకు ప‌ద‌వి ద‌క్కలేదు? అనే ప్రశ్నలు టీడీపీ నేత‌ల మ‌ధ్య హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.అయితే, ఎంపీల సూచ‌న‌లు, స్థానికంగా ఉన్న నాయ‌కుల సిఫారసుల నేప‌థ్యంలోనే మ‌హిళల నియామ‌కం జ‌రిగింద‌ని, ఈ క్రమంలో ఎంపీ కేశినేనినాని ఆమెను ప‌క్కన పెట్టార‌ని, అధినేత చంద్రబాబు సైతం ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. మొత్తానికి గ‌ట్టి వాయిస్ వినిపించిన పంచుమ‌ర్తి అనురాధకి గుర్తింపు లేక‌పోవ‌డం బాధాక‌ర‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చంద్రబాబు త‌న‌ను ప‌క్కన పెట్టడాన్ని జీర్ణించ‌కోలేని ఆమె తాజా ప‌రిణామాల‌తో మ‌రింత‌గా ర‌గిలిపోతున్నార‌ట‌.

Related Posts