ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయరికార్డు
ప్రకాశం,
కరోనా వైరస్ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయరికార్డు స్థాపించింది. పరీక్షల్లోనే కాకుండా కరోనా రికవరీలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతోంది. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభాతో పాటు, మౌలిక వసతుల్లో ముందున్న అతి పెద్ద రాష్ట్రాలే పరీక్షలు, రికవరీల్లో మనకంటే వెనక ఉన్నాయి. మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు చేస్తూ ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో 94.52 శాతం రికవరీ రేటు నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. దేశ సగటు రికవరీ రేటు 87.78గా నమోదైంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా రికవరీలో ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోను ఏపీ అదే హవా సృష్టిస్తుండటం గమనార్హం. ఆరునెలల కిందట ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేని రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం 14 వైరాలజీ ల్యాబొరేటరీలు, ట్రూనాట్ మెషీన్లతో పాటు యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిలియన్ జనాభాకు 1,32,326 మందికి టెస్టులు చేస్తున్నారు. 1,23,111 మందికి పరీక్షలు చేస్తూ అసోం రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కరోనా వ్యాధిగ్రస్తుల మరణాల నియంత్రణలోనూ ఏపీ గణనీయమైన వృద్ధి సాధించింది. గతంలో రోజుకు 90 మరణాలుండగా, ఇప్పుడా సంఖ్య 25కు తగ్గింది. ఈ సంఖ్యను మరింత తగ్గించే వ్యూహంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,83,132 కు చేరింది. కొత్తగా 23 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,429కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 4,591మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 70,66,203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36,474యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,945 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,986 మందికి వైరస్ సోకిందని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం బాధితుల సంఖ్య 7,83,132కి చేరుకుంది. తాజాగా పశ్చిమగోదావరిలో 575 మంది కరోనా బారినపడగా.. కృష్ణాలో 503, గుంటూరులో 496, తూర్పుగోదావరిలో 481, చిత్తూరులో 458 కేసులు వెలుగులోకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 7,40,229కి పెరిగాయి. గత 24 గంటల్లో 23 మంది కరోనాతో మరణించారు. చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురేసి చొప్పున చనిపోగా.. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, కడప, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాలు 6,429కి పెరిగాయి.