నంద్యాల అక్టోబర్ 20
మంగళవారం నాడు యస్ యప్ ఐ . కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యస్ యప్ ఐ జిల్లా అధ్యక్షులు నిరంజన్ మాట్లాడుతూ పిల్లల చదువుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు డిపాజిట్ల రూపంలో లక్షల రూపాయల కేశవరెడ్డి విద్యాసంస్థల యాజమాన్యానికి డిపాజిట్ చేశారన్నారు. వారి పిల్లలు చదువులు పూర్తయింది. దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా యాజమాన్యం డిపాజిట్ డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి బెయిల్ పై బయటకు వచ్చి లగ్జరీ జీవితం గడుపుతుంటే బాధితులు మాత్రం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు.ఇప్పటికే కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని డబ్బు చెల్లించకపోతే మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు. కావున ప్రభుత్వం చొరవ చూపి బాధితుల డబ్బులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు లక్ష్మణ్, హిమాద్రీ,నాయకులు సాయి, రమణ తదితరులు పాల్గొన్నారు.