YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నితీష్ కు మ‌రోసారి ప‌ట్టం

నితీష్ కు మ‌రోసారి ప‌ట్టం

పాట్నా, అక్టోబ‌రు 21, 
బీహార్ ప్రజలు మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయం పలు సర్వేల్లో వెల్లడవుతూ వస్తుంది. నితీష్ కుమార్ ఇప్పటికి ఆరుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిజాయితీకి ఆయన పెట్టింది పేరు. నిరాడంబర జీవితం గడుపుతారు. ముఖ్యంగా 2015లో నితీష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పథకాలను బీహార్ లో అమలు చేసి ప్రజల ఆదరణను పొందారనే చెప్పాలి. నితీష్ కుమార్ ఏ పదవిలో ఉన్నా దానికి వన్నె తెస్తారనే పేరుంది. అందుకే ఆయన పేరు ప్రధాని పదవికి కూడా విన్పించింది.రాజకీయాల్లో నితీష్ కుమార్ నైతిక విలువలకు పెట్టింది పేరు. భక్తియార్ పూర్ లో 1951లో నితీష్ కుమార్ జన్మించారు. విద్యుత్తు శాఖలో చిరుద్యోదిగా జీవితాన్ని ప్రారంభించి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ గైసాల్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు.బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ అనేక సంక్షేమ కార్యక్రమాలను తన హయాంలో అమలు చేశారు. ప్రధానంగా పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా మిస్టర్ క్లీన్ గా పేరుపొందారు. అందుకే బీహార్ ఎన్నికలు జరుగుతున్న వేళ జరుగుతున్న సర్వేలు కూడా ఆయనకే అనుకూలంగా వస్తున్నాయి. మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కావాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు. టైమ్స్ నౌ మరియు సీ ఓటర్ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం స్పష్టం అయింది.ప్రస్తుతం జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇందులో బీజేపీ 80 సీట్లు, జేడీయూ 70 సీట్లను సాధిస్తుందని ఈ సర్వేలో తేలింది. విపక్ష కూటమి కేవలం 76 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే తేల్చింది. 32 శాతం మంది బీహార్ ప్రజలు నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఎన్డీఏ కూడా నితీష్ కుమార్ నే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మొత్తం మీద ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ నితీష్ కుమార్ సీఎం కావాలని బీహారీలు కోరుకుంటున్నారని సర్వేల్లో స్పష్టం కావడం గమనార్హం.

Related Posts