అపోలో ఫార్మసీలో సిబ్బంది నిలువుదొపిడి
పోలీసులకు పిర్యాదు చేసిన ఉద్యోగిని
హైదరాబాద్
హైదరాబాద్ కాప్రా గాంధీ నగర్ అపోలో ఫార్మసీలో సిబ్బందిని పై స్థాయి ఎగ్జిక్యూటివ్ సిబ్బంది నిలువు దోపిడీ చేస్తున్నారని ఒక ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కింది స్థాయి ఉద్యోగుల జీతాల్లో నుండి షార్టేజ్ పేరుతో ప్రతి నెలా 5000 రూపాయల నుండి 8000 వేల రూపాయల వరకు కాజేస్తున్నారని గాంధీ నగర్ అపోలో ఫార్మసీలో పనిచేసే ట్రైనీ ఉద్యోగిని జెస్సీ(బేబీ) ఆరోపించింది. నాతో పాటు మరికొందరి సిబ్బంది వద్ద ఇలాగే నెల జీతంలో నుండి తమ పై స్థాయి ఎగ్జిక్యూటివ్ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. తమకు వచ్చే చాలీచాలని జీతంలో నుండి మొత్తానికి మొత్తం డబ్బులు తీసుకుంటే మేము ఎలా బ్రతకాలని ఆమె ప్రశ్నించింది. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదేంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించింది. ఇదంతా పై అధికారులకు తెలియదని, అపోలో ఫార్మసీలో కొందరు పై స్థాయి ఉద్యోగులు కలిసి కిందిస్థాయి ఉద్యోగుల వద్ద నెల జీతంలో నుండి డబ్బులు వసూలు చేసే మాఫియా తయారయ్యిందని జెస్సీ తెలిపారు. తనతో పాటు బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని జెస్సీ వేడుకుంటున్నారు. అపోలో ఫార్మసీ ఎగ్జిక్యూటివ్ ల నిలువు దోపిడీపై జెస్సీ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.