లాలాపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన
హైదరాబాద్
మంత్రి కేటీఆర్ బుధవారం నాడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. రూ.10 వేల చెక్కును బాధితులకు అందజేసారు. డు తార్నాక డివిజన్ లాలాపేట్ చంద్రబాబు నగర్ లో మంత్రి కేటీఆర్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, స్థానిక కార్పొరేటర్లతో కలసి ఇల్లుల్లి తిరిగారు. బాధితులను పరామర్శించారు.. వారికి ధైర్యం చెప్పారు.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాలలో తాత్కాలిక ప్రభుత్వం 10 వేలు ఆర్థిక సహాయాన్ని అ౦దజేస్తున్నాం. డివిజన్ లలో ని ముంపు ప్రాంతాలలో ఏమైనా సమస్య ఉంటే స్థానిక కార్పొరేటర్ , డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకొని రండి. భాధితగా కుటుంబాలకు అందరికి ఆర్థిక సహాయం అందుతుంది .. ఎవరు ఆందోళన చెందవద్దని అయన అన్నారు.