తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
కరీంనగర్ ఎంపి బండి సంజయ్
ఎల్కతుర్తి
మండలంలోని సురారం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన, నీటమునిగిన పంటలను మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరిట కాలయాపన చేయకుండా తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు అండగా బీజేపీ ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట అధికార ప్రతినిధి ఏనుగు రాకేష్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లా పార్టీ నాయకులు, శివకుమార్, సంతోష్ రెడ్డి, హరిశంకర్, గుండమిది శ్రీనివాస్, నరేశ్, ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి, బి రామారావు, శంకరయ్య, శ్రీవర్ధన్, వెంకటేష్, కిష్టయ్య, జయప్రకాష్, మధూకర్, లింగయ్య, సదానందం, రాజు, శివ, కుమారస్వామి, భాస్కర్,రంగారెడ్డి, స్వాతి, దేవేందర్ రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు.