కోవిడ్ -19 పై అవగాహన ర్యాలీ
ఎమ్మిగనూరు
నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి ఆదేశాలతో పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పర్యవేక్షణలో 200 మంది మెప్మా మహిళా సిబ్బంది అదేవిధంగా సచివాలయ సిబ్బందితో పట్టణ పురవీధుల గుండా బుధవారం నాడు ఉదయం కోవిడ్ 19 పై అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు పట్టణ మెప్మా ప్రొజెక్ట్ ఆఫీసర్ మోహన్ మీడియాకు తెలిపారు. ఈ అవగాహన ర్యాలీ సోమవారం ఉదయం 11 గంటలకు ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం నుండి ప్రారంభమై సోమప్ప సర్కిల్,గాంధీ చౌక్,శరాఫ్ బజార్,సోమేశ్వర టాకీస్ సర్కిల్, శ్రీనివాస టాకీస్ సర్కిల్ గుండా మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వరకు సాగింది. దుకాణదారులు అదే విధంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి, తప్పనిసరి అయితే తప్ప బజార్లలో తిరగకూడదని, గృహనిర్బంధంలో ఉండి పట్టణంలో కరోన వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు
పట్టణ మెప్మా ప్రొజెక్ట్ ఆఫీసర్ మోహన్ తెలిపారు. ఈ ర్యాలీ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావడంతో మెప్మా మహిళా సిబ్బంది, సచివాలయ సిబ్బంది తెల్ల దుస్తులు ధరించి ర్యాలీ లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కోవిడ్ 19 అవగాహన ర్యాలీలో తహసీల్దార్ జయన్న,పట్టణ సిఐ ప్రభాకర్ రెడ్డి,మున్సిపల్ మేనేజర్ యూసుఫ్ 200 మంది మెప్మా మహిళలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.