సచివాలయ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
విశాఖపట్నం
డుంబ్రిగుడ మండల కేంద్రం పరిధిలో ఉన్న కొల్లాపూటు పంచాయితీ బూసిపుాటు జంక్షన్ లో సచివాలయ భవన నిర్మాణ పనులను పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పరిశీలించి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవన నిర్మాణ పనులను త్వర గతిన పూర్తి చేయాలని గుత్తేదారులకు కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనుల్లో నాణ్యత విషయంలో ఎటువంటి రాజి లేకుండా చూడాలని గుత్తేదారులకు పలు సూచనలు చేశారు.గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలు పై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సిదరి.భీమరాజు,చిక్కుడు.మల్లేష్,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.