సరస్వతి అలంకారంలో దుర్గమ్మ
విజయవాడ
ఇంద్రకీలాద్రిపై సరస్వతి దేవి అలంకారంలో జగన్మాత దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నామస్మరణతో మారుమోగింది. బుధవారం తెల్లవారుజామున మూడు
గంటలకు సరస్వతి దేవీ దర్శనం ప్రారంభమయింది. జగన్మాత దుర్గమ్మ జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్త జనం పోటెత్తారు. వినాయకుడు గుడి వద్ద నుంచి క్యూ
మార్గం ద్వార భక్తులను పంపించారు. బంగారు వీణతో భక్తులకు చదువుల తల్లిగా దుర్గమ్మ సాక్షాత్కారించింది. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని
అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. బుధవారం నాడు రోజున అమ్మవారికి
గారెలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పించారు.