YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈ సారి ఐదుగురికి టిక్కెట్లు హుళక్కే

ఈ సారి ఐదుగురికి టిక్కెట్లు హుళక్కే

మ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని టిఆర్ఎస్ పార్టికి చెందిన ఐదుగురు శాసనసభ్యులకు ఈ సారే జరిగే సార్వత్రిక ఏన్నికలలో టికేట్ లబించే అవకాశాలు లేవని చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు అతి సన్నిహితుడైన రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారితో రహస్య సర్వే నిర్వహించిన్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది  శాసనసభ్యులకు టికేట్లు ఇవ్వద్దని ముఖ్యమంత్రి కేసిఆర్ కు చెప్పిన్నట్లుగా తెలిసింది. తెలంగాణ ఉద్యమం సమయంలో టిఆర్ ఎస్ పార్టి  ఎన్నికలలో తమ పార్టి అభ్యర్థులు ఊపులో గెలుపొందడం జరిగింది.. కాని ఇప్పుడు రాబోతున్న సార్వత్రిక ఏన్నికలలో మాత్రం ఆ ఊపు ఇప్పుడు వున్న టిఆర్ఎస్ శాసనసభ్యులలో కొందరికి  లేదని చెప్పవచ్చు.. ముఖ్యమంత్రి కేసిఆర్ వివిధ సర్వే సంస్థల ద్వార రహస్యంగా సర్వే నిర్వహించడం జరిగింది. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ కు అతి సమీపంగా వుండే రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో రహస్య సర్వే చేయించడం జరిగింది. ఈ సర్వే లో తెలంగాణ రాష్ట్డంలో సుమారు 40 మంది శాసనసభ్యులలో, కొందరు మంత్రులు కూడ ఓడిపొయే అవకాశం వున్నందున ఓ రహస్య సర్వేను ముఖ్యమంత్రికి సమర్పించిన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.    ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విశయానికి వస్తే... టిఆర్ఎస్ పార్టి నుంచి ఏడుగురు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఏడుగురు శాసనసభ్యులలో ఇద్దురు మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో ఐదుగురు మాత్రం ఓడిపోయే అవకాశం వుందని, వారికి వచ్చే అసెంబ్లీ ఏన్నికలలో టికేట్ల కేటాయింపు చేయరాదని ఆ సర్వేలో స్పష్టంగా వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కూడ ఆ సర్వే ఆధారంగా ముందడుగు వేస్తారా లేక ఓడిపోయిన పర్వాలేదు వారికే ఇస్తారా... లేక పార్టినే నమ్ముకొని వున్న వారిలో ఎవరికైన అవకాశం కల్పిస్తారా అనేది వేచిచూడాల్సిందే...షాద్ నగర్ నియోజకవర్గానికి వస్తే ఎమ్మేల్యే అంజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మేల్యే ఏకపక్ష ధోరణితో, వ్యవహరిస్తున్నారని విమర్శలు కుడా లేకపోలేదు.. అలాగే ఇక్కడ టిఆర్ఎస్ పార్టిలో వర్గపోరు మొదలైంది, మూడు గ్రూపులుగా విడిపోవడంతో ఇద్దరు ప్రధాన నాయకులు ఎమ్మేల్యేకు దూరంగా వుంటున్నారు. వీర్లపల్లి శంకర్ ఏకంగా ఈ సారి టికేట్ నేనే దక్కించుకుంటా అనే రీతిలో తన అనుచరుల బలాన్ని చూపించేందుకు ప్రయత్నాలు కూడ చేస్తున్నారు.  అందె బాబయ్య మాత్రం వివాదంలోకి వెళ్లకుండా తనదైన శైలీలో ముందుకు సాగుతున్నారు.మహబూబ్ నగర్ నియోజకవర్గ విషయానికి వస్తే ఎమ్మేల్యే శ్రీనివాస్ గౌడ్  మాత్రం ప్రతిరోజు  అభివృద్ది విషయంలో అహర్నింశలు కృషి చేస్తున్నా మైలేజి రాకపోగా ప్రజలలో అసంతృప్తి మిగిలిపోయింది. అనుచర వర్గం వారే బాగుపడుతున్నారని రెండవ స్థాయి నాయకుల విషయంలో ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శలు వున్నాయి. డబుల్ బెడ్ రూం ల కేటాయింపులో కూడ అవినీతి చోటుచేసుకోవడంతో అధికారులు జల్లెడ పడుతున్నారు. తనకు అనుకులంగా వున్నవారికే రెండు, మూడు బెడ్ రూంలను కేటాయించడం జరిగిందని విమర్శలు నెలకొన్నాయి. గత ఏన్నికలలో శ్రీనివాస్ గౌడ్ చుట్టు వున్నవారంత నేడు ఆయనకు దూరంగా వుంటున్నారనే విమర్శలు వున్నాయి. తమ్ముడు శ్రీకాంత్ గౌడ్,  అన్న పనులను  చక్కదిద్దుతారనే పుకార్లు వున్నాయి. జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టిని నమ్ముకున్న వారిని దూరంగా వుంచుతు... మొన్నటి వరకు టిడిపి, ఇతర పార్టిలో వున్న వారిని టిఆర్ఎస్ లో చేర్చుకున్న వారికి మాత్రమే కావాల్సిన సహయసహకారాలు అందిస్తున్నారని విమర్శలు వున్నాయి. కేసిఆర్ రహస్య సర్వేలో శ్రీనివాస్ గౌడ్ కు టికేట్ ఇవ్వకూడదని నిర్ణయించిన... తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు కావడంతో ఉద్యోగస్తులలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు వున్నందున శ్రీనివాస్ గౌడ్ విషయంలో కేసిఆర్ పునరాలోచ నలో పడ్డారని పార్టీ వర్గాల సమాచారం. కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తే, కాంగ్రెస్ పార్టిలో వున్నప్పుడు ఎమ్మేల్యేగా జూపల్లి కృష్ణారావు కొనసాగుతున్న సమయంలో కావాల్సిన మంత్రి పదవి  ఇవ్వలేదని, అలిగి కాంగ్రెస్ పార్టికి రాజినామా చేయడం జరిగింది. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టిలో చేరి మంత్రి పదవి హోదాలో సాగుతున్న... కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలలో  జూపల్లి పై అసంతృప్తి నెలకొంది. తన కావాల్సిన అనుచరులతో కోటరిని ఏర్పాటు చేసుకోని ఏ పనులు చేయాలన్న తన కోటరికి చెందిన వారికి ఇవ్వడంతో మిగత కార్యకర్తలంతా కాస్త దూరంగా వున్నారు. చాలకాలంగా జూపల్లినే గెలిపిస్తు వస్తున్న కొల్లాపూర్ ప్రజలు ఈ సారి ఎందుకో జూపల్లి అంటేనే అసంతృప్తిగా వున్నారు. అచ్చంపేట ఎమ్మేల్యే గువ్వల బాలరాజు మొదటి నుంచి కూడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అందరు చూస్తుండగానే మక్తల్ ఎమ్మేల్యే రాంమోహన్ రెడ్డి చెంపను చెల్లు మనిపించారు. అచ్చంపేట లోని ఫారెస్ట్ అధికారిని సైతం దుర్బషలాడటం, సొంత పార్టి నేతలతో కూడ దురుసుగా ప్రవర్తించడంతో టిఆర్ఎస్ పార్టిలోనే ఆయన ముందు ఒకమాట... ఆయన లేనప్పుడు మరోమాటగా వ్యవహరిస్తున్నారు.  నారాయణపేట నియోజకవర్గం విషయానికి వస్తే, టిడిపి పార్టి నుంచి గెలుపొంది... టిఆర్ఎస్ పార్టిలో కలిసిన రాజేందర్ రెడ్డి పై మొదటి నుంచి కూడ కార్యకర్తలలో వ్యతిరేకత అధికంగా వుంది. 

Related Posts