YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమ‌రావ‌తి రిఫ‌రెండం....

అమ‌రావ‌తి రిఫ‌రెండం....

గుంటూరు‌, అక్టోబ‌రు 22, 
ఏపీలో ఇపుడు కొత్త రాజకీయమే నడుస్తోంది. లేకపోతే అయిన దానికీ కానిదానికీ సీబీఐ విచారణ కోరే విపక్షాలు ఇక్కడే ఉన్నాయి. మరో వైపు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే సీఎంని రాజీనామా చేయమనే కల్చర్ కూడా ఏపీలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రజా సమస్యల కంటే అధికార యావ ఎక్కువగా ఉందన్నది నిష్టుర సత్యం. ఈ భావన ఇప్పటికే జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది కూడా. సరే ఎవరేమనుకున్నా తమ రాజకీయం తమదన్న ధోరణిలో విపక్షాలు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో అమరావతి అతి పెద్ద సమస్య అని ఎర్రన్నలు అంటున్నారు. ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా అమరావతి, ప్రత్యేక హోదా అంశాల మీదనే జనం తీర్పు ఇస్తారని తలపండిన ఎర్ర నాయకుడు నారాయణ అంటున్నారు.నిజానికి అమరావతి రాజధాని మాది అన్న సెంటిమెంట్ ఏపీలోని మొత్తం 13 జిల్లాల జనాలకు ఉండి ఉంటే టీడీపీ ఇంత దారుణంగా ఓడేది కాదు, జగన్ అమరావతి విషయంలో ఎలా ఉన్నారన్నది అప్పటికే జనాలకు తెలుసు. ఆయన వస్తే కనుక అమరావతి రాజధాని ఉండదు అని కూడా టీడీపీ గత ఎన్నికల వేళ చాలా ఎక్కువగా ప్రచారం చేసింది. అయినా సరే జగన్ ని భారీ ఆధిక్యతతో గెలిపించారు అంటే దాని అర్ధం ఆ రాజధాని మాది కాదు అన్న భావన ఎక్కడో ఉండడం చేతనే కదా. ఇక అమరావతి ప్రాంత పరిధిలోనే చినబాబు లోకేష్ ఓడాడు , అలాగే టీడీపీ మెజారిటీ సీట్లు కోల్పోయింది. ఇంతకంటే తీర్పులు, రెఫరెండాలు వేరే కావాలా అన్నది వైసీపీ వాదన.అమరావతి రాజధానిగా ఉండాలా? వద్దా? అన్న ఏక వ్యాక్యం మీద పదమూడు జిల్లాల్లో రెఫరెండం పెట్టాలట. అమరావతి ఏకైక రాజధానిగా వద్దు అని అంటూ ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా కూడా తాము జై మూడు రాజధానులూ అంటామని సీపీఐ రామకృష్ణ చెబుతున్నారు. ఇది బాగానే ఉంది. ఇంతకీ రెఫరెండం ఎవరు పెడతారు. దానికి గల విశ్వసనీయత ఏంటి అన్నది కూడా చూడాలి కదా. ప్రభుత్వం రెఫరెండం నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఓట్లు గుద్దుకున్నారు అని అంటారు. ఇక ప్రజా సంఘాలతో నిర్వహించినా అదే నింద వారూ మోయాలి. వందల వేల కోట్లు ఖర్చు చేసి మరీ కేంద్రం ఎన్నికలు నిర్వహిస్తూంటేనే అవి తప్పుల తడక తీర్పులు అంటూ కొట్టేస్తున్న రాజకీయ సమాజంలో రెఫరెండం పెడితే వచ్చే తీర్పుని అందరూ గౌరవిస్తారా అన్నది కూడా చూడాలిగా.మిన్న ప్రజా తీర్పు. మొత్తం అన్ని వర్గాలూ కలసికట్టుగా ఓటేస్తాయి. కళ్లెదుట తిరుపతి ఉప ఎన్నిక ఉంది. ఆ ఎన్నికలు ప్రమాణంగా తీసుకుని అమరావతి అంశం మీద జనంలోకి విపక్షాలు వెళ్లాలని మేధావులు సూచిస్తున్నారు. అయితే తిరుపతిలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. పైగా సానుభూతి ఓటింగ్ ఎటూ కవర్ అవుతుంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయమే అయింది కాబట్టి జనం ఓట్లు వైసీపీకే వేస్తారన్న కంగారు విపక్షంలో ఉంది. అందుకే సీపీఐ లాంటి పార్టీలు కూడా ప్రజా తీర్పు అంటే ఎందుకో మొగ్గు చూపడం లేదు కళ్ల ముందు జనం తీర్పు ఉండగా మళ్ళీ రెఫరెండం అంటూ గొడవ చేయడం దండుగ అని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ మరో మారు గెలిచినా కూడా అమరావతే మా రాజధాని అనే రాజకీయ బాపతు ఉన్న ఏపీలో ఎన్ని రెఫరెండాలు పెట్టినా సరిపోదు కదా.

Related Posts