YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివాదాల మ‌న్సాస్....

వివాదాల మ‌న్సాస్....

విజ‌య‌న‌గ‌రం,అక్టోబ‌రు 22, 
తాతలు, తండ్రులు పేరు నిలబెట్టాల్సిన వాళ్లు కుంటిసాకులు చెబుతూ చెడ్డపేరు తెస్తున్నారు. పేదల కోసం పెద్దలు ఏర్పాటు చేసిన సంస్థలను కూడా తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ పరిస్థితి చూస్తుంటే అదే అని చెప్పక తప్పదు. పూసపాటి గజపతి రాజులు ఎంతో సదుద్దేశ్యంతో పేదలకు అన్ని విధాలుగా ఉపయోగపడాలని మాన్సాస్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. తమకున్న విలువైన భూములను కూడా ట్రస్ట్ కు దానం ఇచ్చారు.మాన్సాస్ ట్రస్ట్ 1958లో ఏర్పాటయింది. దీనిని పీవీజీ రాజు స్థాపించారు. అయితే ఈ ట్రస్ట్ కు పూసపాటి వంశీయులే ధర్మకర్తలుగా ఉంటారని నిబంధనలు విధించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలను జరుగుతున్నాయి. అందులో విద్యా రంగం కూడా ఒకటి. పేదలకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో విజయనగరంలో మహారాజా కాలేజీని ఏర్పాటు చేశారు. ఈ కళశాల లనుంచి ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ విద్యనభ్యసించారు.కానీ మాన్సాస్ ట్రస్ట్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే అప్పటి వరకూ మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తప్పించి ఆనందగజపతిరాజు కుమార్తె సంచయితను ఛైర్మన్ గా నియమించింది. ఇది కుటుంబ వ్యవహారమని ప్రభుత్వం కొట్టిపారేస్తున్నా ట్రస్ట్ తీసుకుంటున్న నిర్ణయాలను మాత్రం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంఆర్ కళాశాలను ప్రయివేటీకరిస్తూ మాన్సాస్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలతో పాటు స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.కానీ ఇది తమ నిర్ణయం కాదని మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత ఛైర్మన్ సంచయిత కొట్టిపారేస్తున్నారు. అశోక్ గజపతిరాజు ఛైర్మన్ గా ఉన్నప్పుడే 2017లో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె చెబుతున్నారు. అయితే గతంలో అశోక్ గజపతిరాజు నిర్ణయం తీసకున్నా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అమలు పర్చలేదు. ఇప్పుడు సంచయిత దానిని అమలుపర్చేందుకు సిద్దమయ్యారు. ట్రస్ట్ అంటే సేవా భావంతో ఏర్పాటు చేసింది. అందులో ప్రయోజనాలు ఆశించ కూడదని, రాజుల ఆశయాలకు గండి కొట్టవద్దని స్థానికులుకోరుతున్నారు. మరి ఈ వివాదం ఎటువైపునకు దారితీస్తుందో చూడాలి.

Related Posts