చిత్తూరు, అక్టోబరు 22,
టైం అలాంటిది. వైరస్ లు రాజ్యమేలుతున్న టైం కదా. లాక్ డౌన్ ఉంది అన్నా ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అయితే.. ఏపీలో మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో అనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ లాకులన్నీ విడిపోయి.. జనం అంతా కలిసి జన జీవన స్రవంతిలా ఏర్పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో మళ్లీ లాక్ డౌన్ అంటే.. పిచ్చి లేస్తుంది జనాలకి. కానీ.. తప్పదేమో.. సెంట్రల్ గవర్నమెంట్ కానీ.. లాక్ డౌన్ అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా తలూపితే.. జనం తల బయటపెట్టకుండా ఇంట్లో ఉండాల్సిందే. మరి సడన్ గా ఇప్పుడీ లాక్ డౌన్ ఎవ్వారం ఏందయ్యా అంటే. నిన్ననే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డేంజరస్ ఏరియాల్ని గుర్తించింది. ఈ ఏరియాల్లో కరోనా కంట్రోల్ అవ్వకపోవడంతో పాటు.. పెరుగుతోంది. కేరళలో అయితే మరీ దారుణంగా ఉంది ఎవ్వారం. కేరళలోనే కాదు. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఆల్రెడీ 30 సీరియస్ సెంటర్స్ ని డిక్లేర్ చేసింది కదా. ఆ సెంటర్స్ లో.. ఆ జిల్లాల్లో లాక్ డౌన్ పెడతారనే టాక్ వినిపిస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ లో కోవిడ్ కంట్రోల్ పై వర్క్ చేస్తున్న ఆఫీసర్లు.. లాక్ డౌనే బెటరని సజెస్ట్ చేస్తున్నారట. ఆ జిల్లాల్ని కానీ లాక్ డౌన్ తో కంట్రోల్ చేస్తే.. దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలూ కంట్రోల్ లో ఉన్నట్లే అంటున్నారట.సో.. ఈ సారి కానీ.. డేంజర్ థర్టీ డిస్ట్రిక్ట్స్ లో లాక్ డౌన్ పెడితే.. ఏపీలో ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ తప్పదు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాలు.. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన 30 డేంజరస్ కరోనా లిస్ట్ లో ఉన్నాయి. ఈ 30 జిల్లాల్లో కానీ లాక్ డౌన్ పెడదాం అని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే.. తప్పేలా లేదు. కాకపోతే.. సంపూర్ణ లాక్ డౌన్ లా కాకుండా.. రిస్ట్రిక్షన్స్ తో కూడిన లాక్ డౌన్ ని సజెస్ట్ చేస్తున్నారట. చూడాలి మరి. వాళ్లేం ఆలోచిస్తారో.. వీళ్లెలా రియాక్ట్ అవుతారో.