YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిన్న‌మ్మ‌తో చిక్కులు త‌ప్ప‌వా

చిన్న‌మ్మ‌తో చిక్కులు త‌ప్ప‌వా

చెన్నై‌, అక్టోబ‌రు 22,
తమిళనాడులోనూ జయలలిత రాజకీయంగా అత్యంత శక్తిమంతురాలు. అలాంటి జయలలిత శశికళకు తలొగ్గారు. జయలలిత పార్టీలో బతికున్నప్పుుడు కూడా శశికళ హవా నడిచేదంటారు. చిన్నమ్మ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించేందంటారు. జయలలిత జీవించి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు శశికళ ప్రాపకం పొందేందుకే ఎక్కువ తాపత్రయపడే వారంటారు. జయలలిత మరణం తర్వాత అందరూ ఆమె రాజకీయ వారసురాలు శశికళ అవుతుందనుకున్నారు. అందరూ అనుకున్న విధంగానే శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారు కూడా.నిజానికి శశికళ నాయకత్వాన్ని తొలినాళ్లలోనే పన్నీర్ సెల్వం వ్యతిరేకించారు. శశికళ నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని చెప్పి వేరు కుంపటి పెట్టుకున్నారు పన్నీర్ సెల్వం. నాయకత్వం శశికళకు అప్పగించేందుకు ససేమిరా అన్నారు. జయలలిత మెచ్చిన నేత పన్నీర్ సెల్వం కావడంతో కొందరు ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మాత్రం కాదు. అమ్మ జయలలిత మరణం వెనక శశికళ ఉన్నారని పన్నీర్ సెల్వం పదే పదే అప్పట్లో విమర్శలు చేశారు.కానీ అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లాల్సి రావడంతో తనకు అత్యంత నమ్మకస్థుడైన పళనిస్వామిని శశికళ ముఖ్యమంత్రిని చేశారు. తాను జైలు నుంచి వచ్చేంత వరకూ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడతారన్న నమ్మకంతో శశికళ పళనిస్వామి వైపు మొగ్గు చూపారు. పళనిస్వామి ముఖ్మమంత్రి కావడం, ఆ తర్వాత పన్నీర్ సెల్వం కూడా పళనిస్వామితో కలసి పోవడం చకాచకా జరిగిపోయాయి. ఇద్దరూ కీలక నేతలుగా అన్నాడీఎంకేలో మారారు. శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్ ను పార్టీ నుంచి తొలగించగలిగారు.ఇద్దరు నేతలు శశికళను మోసం చేసినవారే. శశికళ జైలు నుంచి విడుదలయిన తర్వాత అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకుంటారన్న భావనతోనే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడకుండా పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు ఒక్కటయ్యారు. తాము కొట్లాడుకుంటే పార్టీ నేతలు శశికళ వైపు మొగ్గు చూపుతారని భావించారు. శశికళ పార్టీ పగ్గాలు తిరిగి చేపడితే ఇద్దరికి రాజకీయ భవిష్యత్ ఉండదు. అందుకే ఇద్దరూ ఒక్కటయ్యారు. శశికళ దృష్టిలో వీరిద్దరూ మోసగాళ్లే. వీరిద్దరి దృష్టిలో శశికళ అమ్మ జయలలితను మోసం చేసిన వ్యక్తిగా మిగిలిపోయారు. అందుకే పన్నీర్, పళనిలు విభేదాలు మరిచి ఒక్కటయ్యారు.

Related Posts