YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అంతు చిక్క‌ని క‌మ‌ల వ్యూహం

అంతు చిక్క‌ని క‌మ‌ల వ్యూహం

చెన్నై, అక్టోబ‌రు 22, 
దక్షిణాదిన బీజేపీకి కొద్దోగొప్పో అవకాశాలున్న రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణలు మాత్రమే. ఇక ఎక్కడా పెద్దగా బీజేపీకి అవకాశాలు లేవు. అక్కడ ప్రాంతీయ పార్టీలతో కలసి కూటమిగా ముందుకు వెళ్లాల్సిందే. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకూ బీజేపీ అన్నాడీఎంకే కూటమిలోనే ఉంది.కొంతకాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే కూటమితో బీజేపీ పొత్తుపెట్టుకుంది. అయితే ఈ కూటమి సక్సెస్ కాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. దీంతో బీజేపీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే లో సరైన నాయకత్వం లేదు. క్యాడర్ లోనూ నమ్మకం కలిగించే నేతలు లేరు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు సయోధ్యతను ప్రదర్శిస్తున్నా ప్రజలను ఆకట్టుకునే నాయకత్వం లేదన్నది వాస్తవం.దీంతో రజనీకాంత్ వైపు బీజేపీ చూస్తున్నట్లుంది. రజనీకాంత్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించనున్నారు. రజనీకాంత్ పార్టీతో కలసి ముందుకు వెళ్లాలని బీజేపీ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ పార్టీతో వెళితే కొద్దో గొప్పో స్థానాలు దక్కుతాయని, అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. అందుకే అన్నాడీఎంకేకు కటీఫ్ చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అన్నాడీఎంకేతో ప్రస్తుతం రాజ్యసభలో తప్పించి బీజేపీకి ఎక్కడా ఉపయోగం లేదు. ఎన్నికల ముందు కూటమిలో మార్పులు ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్, మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ లు ప్రకటనలు చేయడాన్ని బట్ట ిచూస్తుంటే అన్నాడీఎంకేకు బీజేపీ దూరం జరగాలని డిసైడ్ అయిందంటున్నారు. రజనీకాంత్ కాకున్నా డీఎంకేతోనైనా వెళితే మంచిదని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అభిప్రాయపడుతుంది. మొత్తం మీద ఇప్పటి వరకూ యూజ్ చేసుకుని రాజ్యసభలో తమ పబ్బం గడుపుకున్న బీజేపీ దానిని వదిలేసుకునేందుకు సిద్ధమయింది

Related Posts