YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రిక్రూట్ మెంట్ బోర్డు దిశగా తెలంగాణ అడుగులు

రిక్రూట్ మెంట్ బోర్డు దిశగా తెలంగాణ అడుగులు

రాష్ట్రం లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సామర్థం సరిపోనట్లయితే ఆయా శాఖల్లోనే రిక్రూట్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చేసి భర్తీకి వాటికే అధికారాలు ఇవ్వడంలోని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికలనాటికల్లా లక్షకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికావాల్సిందేనని భావిస్తున్న ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఒక్కో శాఖ నుంచి రిక్రూట్‌మెంట్‌లో జరుగుతున్న జాప్యం గురించి స్వయంగా సిఎం వివరాలను తెలుసుకుని ప్రత్యామ్నాయ వ్యవస్థపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిందిగతేడాది పంద్రాగస్టు వేడుకల సందర్భం గా లక్ష ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన చేసిన తర్వాత జరిగిన పురోగతిపైనా, జరుగుతున్న జాప్యంపైనా, లక్షం మేరకు భర్తీ ప్రక్రియ ఊపందుకోవడంపైనా ఏం చేయాలనేదానిపై సిఎం త్వరలోనే వివిధ శాఖాధిపతులతో, ముఖ్య కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సచివాలయ వర్గా ల ద్వారా తెలిసింది. లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించిన తర్వాత ఆర్థిక శాఖ దాదాపు 70 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నోటిఫికేషన్లు వెలువడకపోవడం, ఆశించినంత వేగంగా భర్తీ ప్రక్రియ జరగకపోవడంపై సిఎం ఇటీవల ఓ ఉన్నతాధికారితో చర్చించినట్లు తెలిసింది. లక్షం మేరకు భర్తీ జరగాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ఇప్పటివరకు గరిష్టంగా 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయగలిగామని, కొన్ని పోస్టుల భర్తీ నోటిఫికేషన్ దశలోనే ఉన్నదని భావించిన సిఎం ప్రక్రియలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. పార్టీ ప్లీనరీ, రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రక్రియ ముగిసిన వెంటనే కొలువుల భర్తీపై సిఎం దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది.

Related Posts