YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవంబర్ 28 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష అమరావతి 

నవంబర్ 28 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష అమరావతి 

నవంబర్ 28 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష
అమరావతి 
ట్రిపుల్ ఐటీ లో 10 వ తరగతి పరీక్షల ఫలితాలు ఆధారంగా అడ్మిషన్స్ జరుగుతాయి. ఈ సారి కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. అందుకే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. అదే విధంగా ఎన్ జి రంగా, ఎస్వీ వెటర్నరీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ డిప్లమా కోర్స్ లు కి ప్రవేశ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు,  
గురువారం పరీక్షల ప్రకటన వెలువడుతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు నవంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. తర్వాత 1000 రూపాయలతో అపరాదరుసుము తో నవంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 28 న పరీక్ష నిర్వహిస్తాం. డిసెంబర్ 5 న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తాం. ప్రవేశ పరీక్షకు ఓసి అభ్యర్థులు - 300, బిసి అభ్యర్థులు - 200, ఎస్సి, ఎస్టీ 
అభ్యర్థులకు 100 రూపాయిలు ఫీజు చెల్లించాలని అన్నారు. పదవ తరగతి స్థాయిలో మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. తెలంగాణలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 
పరీక్ష ఆఫ్ లైన్ లో ఓఎంఆర్ షీట్ లో నిర్వహిస్తాం. ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. కరోనా కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుని పరీక్ష నిర్వహిస్తాం. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

Related Posts