YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నూరు తప్పుల ముఖ్యమంత్రి కేసీఆర్ చేగుంట రోడ్డు షోలో ఎంపీ అరవింద్

నూరు తప్పుల ముఖ్యమంత్రి కేసీఆర్ చేగుంట రోడ్డు షోలో ఎంపీ అరవింద్

నూరు తప్పుల ముఖ్యమంత్రి కేసీఆర్
చేగుంట రోడ్డు షోలో ఎంపీ అరవింద్
దుబ్బాక
తెలంగాణ ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడికి ముఖ్యమంత్రి పదవి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయి.  తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు ఇచ్చిన మాట తప్పారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శించారు.  గురువారం అయన చేగుంట లో రోడ్డు షో నిర్వహించారు.  ఉద్యమ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ నిధులు దోచుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో దోచుకుంటున్నాడని అయన ఆరోపించారు. నూరు తప్పులు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. దుబ్బాక ఉప ఎన్నిక మూడవ తారీఖు నాడు ప్రజలు బిజెపికి గెలిపించి ముఖ్యమంత్రి తలను నరుకుతారు.   గాంధీ భవన్లో జీతాలు సైతం ముఖ్యమంత్రి నివాసం నుండి 
వెళ్తున్నాయి.  కాంగ్రెస్ కు ఓటు వేస్తే దేశ ద్రోహం చేసినట్లే.   కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయింది.   ఏడు సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అరవింద్ అన్నారు.  నేడు వచ్చిన హరీష్ రావు మాత్రం నాకు రెండు కళ్ళు అంటూ ప్రజల్ని మోసగిస్తున్నారు.  కల్వకుంట్ల కుటుంబం ఉదయం నుండి కలెక్షన్లు చేసి రాత్రి కాగానే ఫామ్ హౌస్ లో పంచుకుంటారు.  చిల్లర డబ్బుల కోసం హరీష్ రావు కక్కుర్తి పడుతున్నాడు.  సిద్ధాంతం పై నిలబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామమందిర నిర్మాణం చేపట్టారు.  మైనార్టీ సోదరులకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ.   హైదరాబాద్ లో వరద నష్టం జరిగిన వారికి డబ్బులు ఇస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో 
పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదని అన్నారు.
టిఆర్ఎస్ కు ఓటమి పాలైతే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయని టిఆర్ఎస్ వారు ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్,  కరీంనగర్ లో టిఆర్ఎస్ ఓడిపోతే ఎందుకు ఆపలేదని అయన ప్రశ్నించారు.

Related Posts