YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మామిడి అధరహో....

మామిడి అధరహో....

మామిడి పండ్ల ధరలు పుల్లగా మారాయి. ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణం అనుకూలించ లేదు. తెగుళ్లు దాడిచేయడం, పూత ఆలస్యం కావడంతో దిగుబడి అమాం తం తగ్గింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కంటే 8 నుంచి 10 రెట్లు పెరిగాయి. పండ్లవైపు చూసేందుకు సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హెక్టారుకు గత ఏడాది 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తే ఈ ఏడాది 4 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు.  మామిడికి విదేశాల నుంచి భారీగా డిమాండ్ ఉండటం, అందుకు తగినట్లుగా దిగుబడి లేకపోవటమే దీనికి కారణం. గత నెలలో అకాల వర్షాల కారణంగా మామిడి తోటలు దెబ్బ తినటంతో దేశంలో దిగుబడి ఈ ఏడాది 20 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 50 శాతానికిపైగా మామిడి తోటలు దెబ్బ తిన్నాయి. దేశంలో మామిడి దిగుబడిలో 2/3 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే వస్తోంది.  దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మామిడిలో సగం ఆంధ్రప్రదేశ్, యూపీ నుంచే వస్తోంది.  గత మూడేళ్లలో విదేశాలకు మామిడి ఎగుమతులు 27 శాతం పెరిగాయి. 2012-13లో రూ.267 కోట్ల విలువైన మామిడి ఎగుమతులు జరిగాయి. దేశీయ మార్కెట్‌లో మామిడి ధరల పెరుగుదలకు ఇది ప్రధాన కారణం. జిల్లాలో 46 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. కొన్ని చెట్లకు పూతే రాలేదు. చెట్లకు అరకొరగా ఉన్న కాయలు ఇటీవల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు నేలపాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు చేరుతున్న పంటకు ధర బాగుండడంతో రైతులు సంతోషపడుతున్నారు. గత ఏడాది పణుకులు టన్ను ధర రూ.6 వేలు ఉంటే ఈ ఏడాది రూ.60 వేలు పలుకుతోంది. సువర్ణరేఖ రకం గతేడాది రూ.20 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలు, బంగినిబిల్లి రకం రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.90 వేలు, పరియాలు రూ.2 వేలు నుంచి రూ.40 వేలకు, రసాలు గత ఏడాది రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలకు చేరింది. పండ్ల ధరలతో పాటు మామిడి తాండ్ర ధరలు సైతం అమాం తం పెరగనున్నాయి. గత ఏడాది కేజీ తాండ్ర రూ.100 నుంచి రూ.120 ఉంది. ఇప్పుడు కేజీ తాండ్ర ధర రూ.600 నుంచి 800 వరకు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 

Related Posts