YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

అర్చకుల సర్వే యాప్ ను ప్రారంభించిన ప్రదీప్ రెడ్డి  

అర్చకుల సర్వే యాప్ ను ప్రారంభించిన ప్రదీప్ రెడ్డి  

అర్చకుల సర్వే యాప్ ను ప్రారంభించిన ప్రదీప్ రెడ్డి          
మంత్రాలయం 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకుల సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయడం సంతోషించదగ్గ విషయం అని  వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర సెక్రెటరీ ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం ఎమ్మిగనూరులో తమ స్వగృహంలో అర్చక సర్వే యాప్ ను  ప్రారంభించారు.ఆంధ్ర రాష్ట్ర అర్చక  సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహస్వామి తోటి అర్చకులతో కలసి గురువారం ఎమ్మిగనూరులో ప్రదీప్ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకుల  సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక యాప్ ను తయారు చేశామని వివరాలను నమోదు చేసి అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సదుపాయాలను అందించడమే ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు .అర్చకుల సమస్యల పరిష్కారానికి తాము కూడా తమ వంతు కృషి చేస్తామని ప్రధీప్ రెడ్డి హామీ ఇచ్చారు. సర్వే యాప్ ద్వారా ప్రభుత్వ పథకాలు కరోనా భృతి అర్చకులకు అందిందా లేదా ప్రభుత్వం ద్వారా ఇచ్చే సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అర్చకుల ప్రధాన సమస్యలు తెలుసుకోవడం అర్చకులకు కోడ్  దేవాలయాలకు కోడ్  ఉన్నదా లేదా దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం , 43 రిజిస్టర్ నమోదు అయినది లేదా అర్చకుల గుర్తింపు కార్డుల కోసం అర్చకులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం అర్చకులకు కనీస సదుపాయాలు కల్పించడం కోసం వారి పిల్లల వివాహము ఉపనయనము ఇంటి స్థలాల మొదలగునవి ఈ యాప్ ద్వారా మనం నమోదు చేసి అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అర్చకుల సమైక్య  రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహయ్య  స్వామి తెలిపారు.  మంత్రాలయం నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో అర్చకులు అందరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కోటేకళ్ పద్మనాభ స్వామి, రామకృష్ణ జగధీష్ స్వామి ఏనుగు బాల నరసింహయ్య స్వామి చిన్న తుంబళం శ్రీ హారి ఆచార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts