YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పదకొండేళ్ల తర్వాత కృష్ణమ్మకు భారీ వరద

పదకొండేళ్ల తర్వాత కృష్ణమ్మకు భారీ వరద

విజ‌య‌వాడ‌‌,అక్టోబ‌రు 23, 
పదకొండేళ్ల తర్వాత అక్టోబరులో కృష్ణమ్మకు భారీ వరద వచ్చింది. దీంతో శ్రీశైలం జలాశయంలోకి వరుసగా ఎక్కువ రోజులు వరద పారింది. 2009 అక్టోబరులో 1లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదు అవ్వడంతో.. కర్నూలు పట్టణం సహా జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలలోకి బ్యాక్ వాటర్ చేరింది. దాంతో వందలాది ఇల్లు నేలమట్టమయ్యాయి. కర్నూల్ నగరమైతే నదిని తలపించింది. ఆ సమయంలో సుమారు 25 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది అక్టోబరు 25న 6.52 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.. ఇది నాలుగురోజుల పాటు రావడంతో ప్రాజెక్టులోకి పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా నీరువచ్చింది. తాజాగా శ్రీశైలంలోకి 7 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం వచ్చి చేరుతోంది. అక్టోబరులో ఇంత భారీ వరద రావడం పదకొండు సంవత్సరాలలో అరుదు అంటున్నారు అధికారులు. ఇప్పటివరకు 50 రోజులకు పైగా శ్రీశైలం స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేశారు. దిగువన ఉన్న ప్రాజెక్టులు నిండి ఇప్పటివరకు 910 టీఎంసీల నీరు కడలిలో కలిసిపోయాయిమరోవైపు కర్ణాటకలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన ఆలమట్టి జలాశయం నుంచి 1,79,166 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా దిగువన ఉన్న నారాయణపుర జలాశయం నిండడంతో 2,01,487 క్యూసెక్కుల నీటిని జూరాలకు వదులుతున్నారు.. ఇటు తుంగభద్ర నది నుంచి కూడా 40,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో కృష్ణానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

Related Posts