చిన కనకదుర్గమ్మకు బంగారు సూత్రాలు బహుకరణ
ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బస్టాండ్ ఎదురుగా వేంచేసియున్న పురాతన చినకనకదుర్గమ్మ (చిట్టితల్లి) ఆలయంలో అమ్మవారికి తణుకు నియోజకవర్గం అత్తిలికి చెందిన కవ్వాల యల్లయ్య, చిన్ని దంపతులు రూ 25 వేలు విలువ చేసే బంగారు మంగళ సూత్రాలను బహుకరించారు. తాను కోరుకున్న కోరిక నెరవేరాలనీ అమ్మవారికి గతంలో మొక్కుకున్నానని, అందులో భాగంగా అమ్మవారికి బంగారు మంగళసూత్రాలను ఆలయ ధర్మకర్తలు బొడ్డు శ్రీనివాస్, కృష్ణభగవాన్ ల పర్యవేక్షణలో పూజలు చేసి బహుకరించానని యల్లయ్య తెలిపారు. మూడు తరాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడం తమ కుటుంబ సభ్యులకు ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అమ్మవారికి ఇక్కడే తలనీలాలు కూడా సమర్పించామన్నారు. కార్యక్రమంలో కవ్వాల పెద దానయ్య, చిన దానయ్య, దుర్గయ్య, భవాని, మరిడియ్య, వెంకటలక్ష్మి, జి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.